పవన్‌, క్రిష్‌ సినిమాకు మళ్లీ బ్రేక్‌..

20 Jan, 2021 12:44 IST|Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. వకీల్‌సాబ్‌ షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అదే విధంగా దర్శకుడు క్రిష్‌, పవన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుండగా.. ఇప్పటికే పవన్‌ చిత్రీకరణలో జాయిన్‌ అయిపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ షెడ్యూల్‌ గురువారంతో పూర్తి కానుంది. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలను కంప్లీట్‌ చేయనున్నాడు క్రిష్‌. ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడనుంది.
చదవండి: పవన్‌ సినిమాలో అనసూయకు 'స్పెషల్‌' ఛాన్స్‌.?

ప్రస్తుత షెడ్యూల్‌ అయిపోయిన తర్వాత 20 రోజులపాటు షూటింగ్‌కు విరామం ఇవ్వనున్నాడు పవన్‌. ఆ తర్వాత ఫిబ్రవరి రెండో వారంలో తిరిగి చిత్రీకరణలో పాల్గొననున్నాడు. అయితే ఈ మధ్య సమయంలో ‘అయ్యపనుమ్‌ కోషియమ్‌’ షూటింగ్‌లోకి ఎంటర్‌ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో హిట్టయిన ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీరాజ్‌లు హీరోలుగా నటించగా.. బిజూ మీనన్‌ పాత్రను పవన్ కల్యాణ్‌, రానా పృథ్వీరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు ఈ రెండు చిత్రాల అనంతరం రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. అంతేగాక వైపు పవన్‌తో సినిమా కోసం హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి కథలతో సిద్ధంగా ఉన్నారు.
చదవండి: పవన్‌కు త్రివిక్రమ్‌ మాట సాయం

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు