పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

16 Apr, 2021 17:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ కరోనా బారిన పడ్డాడు. తాజా పరీక్షల్లో అతడికి కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. కాగా అస్వస్థతకు లోనైన సమయంలో కరోనా పరీక్షలు చేయించుకోగా తొలుత ఫలితాలు నెగిటివ్‌గా వచ్చాయి. దీంతో డాక్టర్ల సలహా మేరకు తన వ్యవసాయక్షేత్రంలో క్వారంటైన్‌కు వెళ్లాడు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో రెండు రోజుల కిందట మరోసారి కోవిడ్‌ పరీక్షలు జరపగా పాజిటివ్‌ అని తేలింది. ఖమ్మంకు చెందిన కార్డియాలజిస్టు డాక్టర్‌ తంగెళ్ళ సుమన్‌ హైదరాబాద్‌కు వచ్చి పవన్‌కు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటివైరల్‌ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్‌ కూడా ఇస్తున్నారు.

అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్‌ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా వుంటే ఈ మధ్యే ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, బండ్ల గణేశ్‌ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జ్వరం, తదితర కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న బండ్ల గణేష్‌ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. 

చదవండి: ఇదో కొత్త అనుభూతిని ఇస్తుంది
నిలకడగా బండ్ల గణేష్‌ ఆరోగ్యం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు