వారందరికి ధన్యవాదాలు: పవన్‌ కళ్యాణ్‌

2 Sep, 2020 20:28 IST|Sakshi

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా బుధవారం నాడు ఆయన ఫ్యాన్స్‌కు చాలా స‌ర్‌ప్రైజ్‌లు అందాయి.  ఆయన నటిస్తున్న 'వ‌కీల్ సాబ్' చిత్రం నుంచి మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుదల చేయడంతో పాటు పవ‌న్ 27వ సినిమాను కూడా అధికారికంగా ప్రకటించారు. పవ‌న్ క‌ల్యాణ్‌- క్రిష్ జాగ‌ర్ల‌పూడి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రం నుంచి ప్రీ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక చాలా మంది సెలబ్రెటీలు, ఆయన అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. చిరంజీవి, వెంకటేశ్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌,  సమంత, రకుల్‌ప్రీత్‌, దేవి శ్రీ తదితర సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా పవర్‌ స్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అభిమానులతో పాటు తనకు పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజల మేలు కోరి భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఏం చేయలేని  పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో శుభాకాంక్షలు స్వీకరించడానికి కూడా మనసు అంగీకరించడంలేదని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తున్నట్లు  జనసేన అధినేత పవన​ కల్యాణ్‌ తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు తన బాధ్యతను మరింత పెంపొందించాయని తెలిపారు.  

చదవండి: అద్భుత‌మైన ప‌వ‌న్‌కు హ్యాపీ బ‌ర్త్‌డే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు