ఏప్రిల్‌ 9న లంచ్, డిన్నర్‌ కలిసి చేద్దాం : దిల్‌ రాజు

30 Mar, 2021 03:53 IST|Sakshi
‘దిల్‌’ రాజు, వేణు శ్రీరామ్, శిరీష్‌

– ‘దిల్‌’ రాజు

పవన్‌  కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాష్‌ రాజ్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. హైదరాబాద్‌లోని సుదర్శన్‌  థియేటర్‌లో అభిమానుల మధ్య ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘సరిగ్గా చెప్పండి.. ఏం చెప్పారు.. ఏం చేశారు’, ‘అలా జరగద్దు.. జరగకూడదు’ అనే డైలాగ్స్‌తో టీజర్‌ సాగుతుంది. టీజర్‌ విడుదల సందర్భంగా ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘పవన్‌ కల్యాణ్‌ను బిగ్‌ స్క్రీన్‌ పై చూసేందుకు మనం మూడేళ్ళుగా ఎదురుచూస్తున్నాం. వెయిటింగ్‌ పూర్తయింది. ట్రైలర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ మాత్రమే. ఏప్రిల్‌ 9న లంచ్, డిన్నర్‌ కలిసి చేద్దాం’’ అన్నారు. ‘‘ట్రైలర్‌ కంటే సినిమా ఇంకా బాగుంటుంది’’ అన్నారు వేణు శ్రీరామ్‌. హిందీ హిట్‌  ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ‘వకీల్‌ సాబ్‌’ రూపొందిన విషయం తెలిసిందే.
చదవండి:
లవ్‌స్టోరీ’ వాయిదాపై చిత్ర యూనిట్‌ క్లారిటీ
పదహారువందల మందిని ప్రేమించా'

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు