మీరు వర్జినా?: వకీల్‌ సాబ్‌ ట్రైలర్‌

29 Mar, 2021 18:24 IST|Sakshi

‘మీరు వర్జినా.. అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా’ అంటూ కోర్టులో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వాదిస్తూ కనిపించాడు. ఏం న్యాయం నందాజీ.. కూర్చోండి అంటూ ప్రకాశ్‌ రాజ్‌కు కౌంటర్‌ ఇస్తూ కనిపించాడు. వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ ట్రైలర్‌ శనివారం హోలీ సందర్భంగా చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్ విడుదల‌తో పవన్ కల్యాణ్ అభిమానులకు హోలీ గిఫ్ట్‌ చిత్ర బృందం అందించింది. న్యాయవాది పాత్రలో పవన్‌ అదరగొట్టారు.

అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ల కీలక పాత్రధారులుగా కనిపిస్తున్నారు. ‘మీరు వర్జినా..?. అందరికీ వినబడేట్టు గట్టిగా చెప్పండి’ అంటూ ప్రకాశ్‌ రాజ్‌ నివేథాను ప్రశ్నిస్తుండడంతో ట్రైలర్‌ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నప్పటికీ ట్రైలర్‌లో మాత్రం కనిపించలేదు. న్యాయవాది పాత్రలో పవన్‌ ఆకట్టుకున్నారు. పవన్‌కు ప్రత్యర్థి న్యాయవాదిగా ప్రకాశ్‌రాజ్‌ కనిపిస్తున్నారు. అత్యాచార ఘటనపై కోర్టులో జరిగే వాదోపవాదనలు సినిమాలో కీలకంగా ఉండనుంది. హిందీ సినిమా ‘పింక్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 

శ్రీవేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజ్‌, శిరీశ్‌ ఈ సినిమాను నిర్మిస్తుండగా తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. బోనీ కపూర్‌ సమర్పణలో చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఏప్రిల్‌ 9వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ డిజిటల్ రైట్స్ ను తీసుకోగా.. శాటిలైట్ రైట్స్‌ను జీ తెలుగు కొనేసింది. ఈ సినిమాపై పవన్‌ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు