Payal Ghosh: బాలీవుడ్‌లో అయితే నా దుస్తులు తొలగించేవారు.. ఎన్టీఆర్‌ గురించి ఎప్పుడో చెప్పేసింది

2 Oct, 2023 12:11 IST|Sakshi

పాయల్ ఘోష్ కలకత్తాకు చెందిన ఈ బ్యూటీ. మంచు మనోజ్ నటించిన 'ప్రయాణం' సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టింది.  ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఊసరవెల్లి' సినిమాలో తమన్నా ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం 'మిస్టర్ రాస్కెల్' సినిమాలో  నటించిన తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. కానీ  అక్కడ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. దానికి ప్రధాన కారణం అక్కడి పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులే అని ఆమె పలుమార్లు చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు )

తాజాగా బాలీవుడ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. దేవుడి దయ వల్ల నేను సౌత్‌ ఇండస్ట్రీ నుంచి సినిమాల్లోకి లాంచ్‌ అయ్యాను. ఒకవేళ నేను బాలీవుడ్‌ నుంచి ఎంట్రీ ఇచ్చి ఉండుంటే నా దుస్తులు తొలగించేవారు. అంతటితో ఆగక అలాంటి సన్నివేశాలతో ఇప్పటికే వ్యాపారం చేసుకునేవారు. వాళ్లకు టాలెంట్‌తో పనిలేదు. అమ్మాయిలు దుస్తులు తొలగిస్తే చాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

గతంలో మీ టూ ఉద్యమంలో పాయల్ ఘోష్ పాల్గొనింది.  బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ మీద ఆమె సంచనల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. సినిమాలో అవకాశం కోసం కలిసినప్పుడు అతడు తనపై లైంగిక దాడి చేశాడని అప్పట్లో ఆమె వెల్లడించింది. సౌత్‌ ఇండస్ట్రీలో జూ. ఎన్టీఆర్‌ అంటే తనకు చాలా ఇష్టమని రాబోయే రోజుల్లో బాలీవుడ్‌ను ఏలుతాడని ఆమె ఎప్పుడో చెప్పింది. ఆమె చెప్పినట్లే ఆర్‌ఆర్‌ఆర్‌తో ప్రపంచానికే తను ఎంటో సాటి చెప్పాడు తారక్‌.

మరిన్ని వార్తలు