రిచాను క్షమాపణలు కోరిన పాయల్‌

9 Oct, 2020 10:57 IST|Sakshi

తప్పు ఒప్పుకున్న నటి పాయల్‌ ఘోష్‌

నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ

పాయల్‌ను క్షమించిన రిచా చద్దా

ముంబై: లైంగిక ఆరోపణల నేపథ్యంలో నటి రిచా చద్ధాపై తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, బేషరతుగా ఆమెను క్షమాపణలు కోరుతున్నాని నటి పాయల్‌ ఘోష్‌ ముం​బై హైకోర్టుతో పేర్కొన్నారు. రిచా కూడా క్షమాపణలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా బాధపెట్టాడని ఇటీవల పాయల్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి రిచాపై పాయల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనపై పాయల్‌ నిరాధారమైన వ్యాఖ్యలు చేసిందంటూ చద్ధా గత వారం ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పాయల్‌ తన న్యాయవాది నితిన్‌ పాట్పుట్‌... హైకోర్టులో విచారణకు జస్టిస్‌ మీనన్‌ ఎదుట హాజరయ్యారు. రిచాపై చేసిన వ్యాఖ్యలకు పాయల్‌ చింతిస్తున్నట్లు చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఆమెను కించపరిచేందుకు చేసిన వ్యాఖ్యలు కాదన్నారు. పాయల్,‌ రిచా అభిమాని అని, ఆమెను గౌరవిస్తున్నారని చెప్పారు. ఏ స్త్రీని కించపరచాలన్న ఉద్దేశం పాయల్‌కు‌ లేదని నితిన్‌ పేర్కొన్నారు.(చదవండి: నటిపై ఆరోపణలు; రూ. కోటి పరువు నష్టం దావా)

తాము పాయల్‌ క్షమాపణలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి నష్టపరిహారాన్ని పొందే ఆలోచన లేదని రిచా న్యాయవాది వీరేంద్ర తుల్జాపూర్కర్‌, సవీనా బేడీ సచార్‌లు కోర్టుకు వెల్లడించారు. అనంతరం రెండు పార్టీలు సమ్మతి నిబంధనలను అక్టోబర్‌ 12న కోర్టులో సమర్పించాల్సి ఉంటుందని జస్టిస్‌ మీనన్‌ చెప్పారు. రిచాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా ఇకపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వును జారీ చేశారు. అయితే ఇటీవల దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తనను లైంగికంగా వేధించాడంటూ నటి పాయల్‌ ఘోష్‌ సబర్బన్‌ వెర్సోవా పోలీసు స్టేషన్‌లో‌ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నటి రిచాతో పాటు మరో ఇద్దరూ మహిళా నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: నా పేరెందుకు వాడారు?: నటి)

(చదవండి: ఈ చెత్తలోకి నన్ను లాగొద్దు: నటి ఫైర్‌)

మరిన్ని వార్తలు