విజయనగరంలో సినీ తారల సందడి.. పోటోలు వైరల్‌

3 Dec, 2022 13:31 IST|Sakshi

సాక్షి, విజయనగరం:  విద్యలనగరమైన విజయనగరంలో సినీ తారలు శుక్రవారం సందడి చేశారు. అభిమానులను చూసి పులకరించిపోయారు. ముగ్గురు నటీమణులు పట్టణానికి వస్తున్నారని తెలుసుకున్న యువతీయువకులు అంబటిసత్రం జంక్షన్, రైల్వేస్టేషన్‌ రోడ్డుకు చేరుకున్నారు. అభిమాన హీరోయిన్లను చూసేందుకు పోటీపడ్డారు. అంబటిసత్రం కూడలి వద్ద సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ 28వ షోరూంను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి  రాష్ట్ర విద్యాశాఖమంత్రి  బొత్స సత్యనారాయణ ప్రారంభించారు.

షాపింగ్‌మాల్‌ దినదినాభివృద్ధి చెందాలని, విజయనగరవాసుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యత కలిగిన వ్రస్తాలను, నగలను అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సర్దార్‌ ఫేమ్‌ రాశి ఖన్నా, ఆర్‌ఎక్స్‌ 100, జిన్నా ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌లు షోరూమ్‌ను సందర్శించారు. అన్నిరకాల వ్రస్తాలు, బంగారు ఆభరణాలను చూసి మురిసిపోయారు. ప్రతి ఒక్కరూ షాపింగ్‌ మాల్‌ను సందర్శించి, నచ్చినవి కొనుగోలు చేయాలని కోరారు.

తమ సినీ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే, రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న సీఎమ్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ పునఃప్రారంభంలో పాల్గొన్న ఊర్వశివో.. రాక్షసివో సినీ ఫేమ్‌  అనూ ఇమాన్యూయేల్‌ అభిమానులతో కేరింతలు కొట్టించారు. సినీ డైలాగ్‌లతో అలరించారు.

మరిన్ని వార్తలు