బాయ్‌ఫ్రెండ్‌ను హీరోగా చేసేందుకు పాయల్‌ ప్రయత్నాలు

10 Jul, 2021 17:15 IST|Sakshi

పాయల్ రాజ్‌పుత్‌‌.. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది. తొలి సినిమాతోనే నెగిటివ్‌ షేడ్‌లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక గ్లామర్‌ డోస్‌తో యూత్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న పాయల్‌ కొంతకాలంగా పంజాబి నటుడు .. గాయకుడు అయిన సౌరభ్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు  ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుండేది. తాజాగా తనకున్న పరిచయాలతో సౌరభ్‌ను తెలుగులో హీరోగా చేసేందుకు పాయల్‌ ప్రయత్నాలు మొదలు పెట్టిందట.


తనకున్న పరిచయాలతో ఇప్పటికే ఓ సినిమాలో ప్రియుడు సౌరభ్‌ను హీరోగా సెట్‌ చేసిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. ఇక పాయల్‌ ప్రస్తుతం సాయికుమార్‌ సరసన  ‘కిరాత‌క‌’అనే మూవీలో నటిస్తుంది. జ‌న్ సినిమాస్‌ ప‌తాకంపై  ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు