'ప్లీజ్‌ పాయల్‌ నెంబర్‌ చెప్పండి', హీరోయిన్‌ ఆన్సర్‌ ఇదే

18 Apr, 2021 20:54 IST|Sakshi

'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకుంది పాయల్ రాజ్‌పుత్‌‌. తర్వాత 'ఆర్‌డీఎక్స్‌ లవ్‌', 'డిస్కో రాజా' సినిమాలు చేసినప్పటికీ ఇది పెద్దగా ఆడలేదు. తర్వాత ఆహాలో వచ్చిన 'అనగనగా ఓ అతిథి'లో పల్లెటూరి యువతిగా నటించి ఆకట్టుకుంది. గతంలో 'బుల్లెట్టు మీదొచ్చె బుల్‌రెడ్డి.. రాజ్‌దూత్‌ మీదొచ్చె రాంరెడ్డి..' అంటూ సీతలో స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడిన ఈ భామ మహా సముద్రంలో కూడా ప్రత్యేక గీతంలో నర్తించనుందట. 

ఎప్పుడూ ఫొటోలను షేర్‌ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే పాయల్‌ ఆ మధ్యే తన చిన్ననాటి స్నేహితుడు సౌరబ్‌ డింగ్రాను ప్రియుడిగా పరిచయం చేసింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతడు అభిమానులతో చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ మేడమ్‌ ఫోన్‌ నంబర్‌ ఇవ్వండి కదా అని అభ్యర్థించాడు. దీంతో అతడు ఈ ప్రశ్నకు సమాధానం పాయల్‌ చెప్తే బాగుంటుందని ఆమెను ట్యాగ్‌ చేశాడు. దీంతో ఫోన్‌ నెంబర్‌ అడిగిన దాన్ని స్క్రీన్‌ షాట్‌ తీసుకున్న పాయల్‌ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 100 అని బదులిచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ భలే కౌంటరిచ్చావంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: ఫేషియల్‌ చేయమంటే నటిని అందవిహీనంగా మార్చిన డాక్టర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు