Payal Rajput At Jagtial: జగిత్యాలలో పాయల్‌ రాజ్‌పుత్‌ సందడి

2 Aug, 2021 11:43 IST|Sakshi

ఆనంద్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభం

సాక్షి, జగిత్యాలటౌన్‌: తెలుగు సినిమా కథానాయకి పాయల్‌ రాజ్‌పూత్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం సందడి చేశారు. పట్టణంలోని మోచీబజార్‌లో ఏర్పాటు చేసిన ఆనంద్‌ షాపింగ్‌ మాల్‌ను ఆమె ప్రారంభించారు. ఆర్‌ఎక్స్‌–100 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఆమె మరింత దగ్గరయ్యారు.  సినీ హీరోయిన్‌ వస్తున్నారనే సమాచారంతో వివిధ ప్రాంతాలకు చెందిన అభిమానులు ఆమెను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆమెను చూసేందుకు పోటీపడ్డారు. దీంతో మోచీబజార్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పాయల్‌ రాజ్‌పూత్‌ మాట్లాడుతూ జగిత్యాలకు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను ఆదరిస్తున్న అభిమానులు, ఆనంద్‌ షాపింగ్‌ మాల్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. 

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు