ఆ నిశ్శబ్దం భయంకరం

20 May, 2021 00:38 IST|Sakshi

‘కోవిడ్‌ లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి. లైట్‌గా జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్‌ని కలవండి’’ అన్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. పాయల్‌ బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్‌ తల్లి మృతి చెందారు. ఈ సందర్భంగా పాయల్‌ మాట్లాడుతూ – ‘‘నేను, సౌరభ్‌ హైదరాబాద్‌లో ఉన్నాం. అనితా ఆంటీ (సౌరభ్‌ తల్లి) ఢిల్లీలో ఉంటున్నారు. ఒకరోజు ఆంటీ ఫోన్‌ చేసి జ్వరం వచ్చిందని చెబితే, అది మామూలు జ్వరమేమో అనుకున్నాం. ఎక్కువగా ఏసీ రూమ్‌లో ఉంటున్నందున శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి ఉంటుందని ఆంటీ కూడా భావించారు. కానీ ఆ తర్వాత ఆమెకు 103 డిగ్రీల జ్వరం వచ్చింది.

సౌరభ్‌ వాళ్ల అన్నయ్య ఓ హాíస్పిటల్‌లో జాయిన్‌ చేశారు. సౌరభ్, నేను ఢిల్లీ వెళ్లాలనుకున్నా కుదర్లేదు. అయితే ఆకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడ్డారు. చివరికి మాకు దూరమయ్యారు. మా పెళ్లి చూడకుండానే వెళ్లిపోయారని బాధగా ఉంది. ఆంటీకి జ్వరం వచ్చిన రోజే హాస్పిటల్‌లో చేర్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో. ఆమె మరణంతో మా రెండు కుటుంబాల్లో నిశ్శబ్దం నెలకొంది. ఈ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. దయచేసి ఏమాత్రం కోవిడ్‌ లక్షణాలు మీలో కనిపించినా, ఆరోగ్యంపరంగా వేరే అసౌకర్యం ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు