శాండల్‌వుడ్‌కి సై అంటున్న పాయల్‌ రాజ్‌పుత్‌

9 Aug, 2021 00:21 IST|Sakshi
పాయల్‌ రాజ్‌పుత్‌

కన్నడ పరిశ్రమ నుంచి ‘ఆర్‌ఎక్స్‌ 100’ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌కు పిలుపొచ్చింది. కన్నడ హీరో ధనుంజయ నటిస్తున్న తాజా చిత్రం ‘హెడ్‌ బుష్‌’లో హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ నటించనున్నారు. ఆదివారం అధికారిక ప్రకటన వెల్లడైంది. శూన్య డైరెక్ట్‌ చేయనున్న ఈ సినిమా షూటింగ్‌ సోమవారం బెంగళూరులో ప్రారంభం కానుంది. ఓ డాన్‌ జీవితం ఆధారంగా 1960–1980 కాలంలో సాగే కథాంశంతో ఈ సినిమా ఉంటుందనేది శాండల్‌వుడ్‌ టాక్‌.

బెంగళూరుతో పాటు మైసూర్, కోలార్‌ ప్రాంతాల్లో ‘హెడ్‌ బుష్‌’ సినిమా షూట్‌ను ప్లాన్‌ చేశారట. అంతేకాదు.. ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. అలాగే కన్నడ పరిశ్రమలో హీరోయిన్‌గా పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మరోవైపు తెలుగులో ఆదీ సాయికుమార్‌ సరసన ‘కిరాతక’, తమిళ చిత్రం ‘ఏంజెల్‌’ చిత్రాలు చేస్తున్నారు పాయల్‌ రాజ్‌పుత్‌. ఇక పోలీసాఫీసర్‌గా పాయల్‌ నటించిన ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘5 డబ్ల్యూ’ విడుదలకు సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తలు