ఎంతో ప్రేమ చూపించేవారు, కన్నీళ్లు ఆగడం లేదు: పాయల్‌

16 May, 2021 15:31 IST|Sakshi

'ఆర్‌ఎక్స్‌ 100' భామ పాయల్‌ రాజ్‌పుత్‌ ఎమోషనల్‌ అయింది. తన జీవితంలో ఓ ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానంటూ కన్నీటి పర్యంతమైంది. పాయల్‌ ప్రియుడు సౌరభ్‌ ఢింగ్రా తల్లి అనితా కరోనా కారణంగా కన్నుమూసింది. దీంతో తను ఎంతగానే ప్రేమించే ఆవిడ ఇకపై లేదని తెలిసి భావోద్వేగానికి లోనైంది. "మీరు నా పక్కన ఉండకపోవచ్చు. కానీ, నా హృదయంలో ఎప్పటికీ ఉంటారు. కరోనాను జయించేందుకు మీరు ఎంతో పోరాడారు. కానీ చిట్టచివరకు మిమ్మల్నే కోల్పోయాం. మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నాం అనితా ఆంటీ. మా అమ్మలాగే మీరు కూడా నన్ను గారాబం చేసేవారు. నాపై ప్రేమ చూపించేవారు. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మిమ్మల్ని మళ్లీ వెనక్కు తీసుకురావాలని ఉంది. కానీ, అందుకు అవకాశం లేదు కదా!" అని దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అనితా ఆంటీ చివరిసారిగా.. 'నాకు ఊపిరాడటం లేదు' అని చెప్పిందన్న పాయల్‌.. తనకు అవకాశం ఉంటే కరోనాను అంతం చేస్తా అని పేర్కొంది.

కాగా పాయల్‌ ప్రియుడు సౌరభ్‌ ఢింగ్రా తల్లి అనితా కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె పరిస్థితి విషమించడంతో ఎలాగైనా బతికించండంటూ దేవుళ్లను వేడుకుంది. తను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎంతగానో ఆశించింది. కానీ ఆమె కలలను కల్లలు చేస్తూ అనితా ఢింగ్రా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం విషాదాన్ని నింపింది.

చదవండి: నవ్వించడం అంత ఈజీ కాదు: పూజా హెగ్డే

కోలీవుడ్‌ నటికి లెక్చరర్‌ వేధింపులు

ప్రియుడి తల్లి పరిస్థితి విషమం: ప్రార్థిస్తున్న పాయల్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు