ఇంట్లో ఒప్పుకోలేదు, రెండు రోజులు ఏడ్చాను: హీరోయిన్‌

26 Sep, 2023 04:38 IST|Sakshi

విరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ప్రగతి శ్రీవాస్తవ విలేకరులతో మాట్లాడుతూ – ‘‘మను చరిత్ర’ సినిమా తర్వాత కోవిడ్‌ వల్ల గ్యాప్‌ రావడంతో ముంబై వెళ్లిపోయా. పెద కాపు 1’కి చాన్స్‌ రావడంతో, ఆడిషన్‌ ఇచ్చాను. సెలక్ట్‌ అయ్యాను. శ్రీకాంత్‌ అడ్డాలగారి గత సినిమాల్లో హీరోయిన్‌పాత్రలు బలంగా ఉంటాయి. అలా ఈ సినిమాలో నాపాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. ఇందులో నాది రూరల్‌ క్యారెక్టర్‌.. చాలెంజింగ్‌ రోల్‌. ఈపాత్రను బాగా చేయగలిగానంటే దానికి కారణం శ్రీకాంత్‌గారే. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకూ మంచి సస్పెన్స్‌తో ఆసక్తికరంగా ఉంటుంది.

నిజానికి సినిమాల్లోకి వెళ్తానంటే ఫ్యామిలీ నుంచి మొదట్లో అస్సలు సపోర్ట్ లేదు. నేను లా, పబ్లిక్ పాలసీ చదివాను. చిన్నప్పటి నుంచీ ఇంట్లో సినిమా వాతావరణం లేదు. సినిమాల్లోకి వెళతానంటే వద్దే వద్దు అన్నారు. రెండు రోజులు ఏడ్చాను కూడా. చివరికి కాంట్రాక్ట్ సైన్ చేసేసానని నాన్నకి చెప్పాను. ‘సైన్ చేసిన తర్వాత ఏం చేస్తాం.. నీ మనసుకు నచ్చింది చెయ్’ అన్నారు. అయితే నటన కొనసాగిస్తూనే చదువుపైనా దృష్టి పెట్టాను. అటు నటన ఇటు చదువు రెండిటిని బ్యాలెన్స్ చేశాను. మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే హోర్డింగ్స్‌పై నన్ను ఒక నటిగా చూసి ఇంట్లో వాళ్లు కూడా ఆనందపడ్డారు’’ అన్నారు.

మరిన్ని వార్తలు