ప్రభాస్‌ సరసన పెళ్లి సందD హీరోయిన్‌!

15 Feb, 2022 15:39 IST|Sakshi

Sri Leela To Share Screen With Prabhas: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన రాధేశ్యామ్‌ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఆదిపురుష్‌, సలార్‌ సినిమాలు సైతం షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఇక ప్రభాస్‌ మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

‘రాజా డీలక్స్‌’ టైటిల్‌ ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త సర్క్యులేట్‌ అవుతుంది. ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్‌ శ్రీలీల.. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్‌ చేసుకోనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లు నటించనుండగా అందులో శ్రీలీల ఒక హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తుంది.

మరిన్ని వార్తలు