పెళ్లి సందD హీరోయిన్‌కు వరుస ఆఫర్లు!, మెగా హీరోతో కూడా ఓ సినిమా?

26 Oct, 2021 19:49 IST|Sakshi

టాలీవుడ్‌కి ఎందరో హీరోయిన్స్‌ని పరిచయం చేసిన గోల్డెన్‌ హ్యాండ్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుది. తెరపై హీరోయిన్స్‌ని ఆయన చూపించినంత అందంగా మరే దర్శకుడు చూపించలేడు అనడంతో అతిశయోక్తి లేదు. అలాంటి శతాధిక దర్శకుడు తన గోల్డెన్‌ హ్యాండ్‌తో తెలుగు తెరపైకి వదిలిన మరో అందాల బాణమే శ్రీలీల. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘పెళ్లి సందD’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ కన్నడ భామ. ఈ సినిమాలో శ్రీలీల తన గ్లామర్‌తో పాటు నటన పరంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. అంతేగాక డ్యాన్స్‌తో కూడా అదరగొట్టింది.

ఇక ఆమె అందంతో పాటు యాక్టింగ్‌, డ్యాన్స్‌ స్క్రీల్స్‌ ఉండటంతో తెలుగు దర్శక-నిర్మాతలు ఆమెకు ఫిదా అవుతున్నారట. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌. ఇప్పటికే ఆమె మాస్‌ మహారాజా రవీతేజ ‘ధమకా’ సినిమాలో హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ నేపథ్యంలో ఆమెకు మరిన్నీ ఆఫర్లు వస్తున్నాయని, దాదాపు  4నుంచి 5 సినిమాల్లో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇవి చర్చల దశలో ఉన్నట్లు వినికిడి. అంతేగాక ఓ మెగా హీరో సినిమా ఆఫర్‌ కూడా వచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

మరిన్ని వార్తలు