ప్రత్యేక విమానంలో అమెరికాకు పయనమైన రజనీకాంత్‌

19 Jun, 2021 15:37 IST|Sakshi

సాక్షి, చెన్నై:  సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం ఉదయం ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడతున్న తలైవా సాధారణ వైద్య పరీక్షలు కోసం ఆయన సతీమణి లతా రజనీకాంత్‌తో కలిసి అమెరికా పయనమయ్యారు. ఈ క్రమంలో శనివారం చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ కెమెరా కంటించి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా కొన్ని సంవత్సరాల క్రితంరజనీ అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం చెక్ అప్ కోసం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమెరికా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 

ఇక గత సంవత్సరం కోవిడ్ -19 ఆంక్షల కారణంగా, ఆయన అమెరికా వెళ్లలేకపోయారు. అయితే ఈ సారి కోవిడ్‌ వేవ్‌ కారణంగా విదేశాలకు వెళ్ళేందుకు ఆంక్షలు ఉండటంతో రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అమెరికా వెళ్ళడానికి అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం రజనీకాంత్‌కు అనుమతి ఇవ్వడంతో శనివారం ఉదయం తన భార్యతో కలిసి చెన్నై నుంచి స్పెషల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో అమెరికాకు బయలుదేరారు. ఈ స్పెషల్ ఫ్లైట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమెరికా వెళుతున్నారు. కొన్ని వారాల పాటు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఆయన తిరిగి జూలై 8 న భారత్ కు వస్తారని తెలుస్తోంది. ఇప్పటికే హాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లుడు ధనుష్ కూతురు ఐశ్యర్య అమెరికాలోనే ఉన్నారు.

సినిమాల విషయానికొస్తే..రజనీకాంత్ ప్రస్తుతం 'అన్నాత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, సూరి, ప్రకాష్ రాజ్ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు.ఈ చిత్రంలో రజనీ నటించాల్సిన సన్నివేశాల షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న. ఈ సినిమాలో తెలుగు నటుడు సత్యదేవ్ ఓ కీలకపాత్రలో నటిస్తునున్నారు. దీపావళీ పండుగ సందర్భంగా నవంబర్ 4న అన్నాత్తే విడుదల కానుంది.

చదవండి: శేఖర్‌ కమ్ముల మూవీపై స్పందించిన ధనుష్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు