Andrea Jeremia : ‘పిశాచు-2'లో ఆండ్రియా వివస్త్రగా నటించిందా?

29 Apr, 2022 21:14 IST|Sakshi

ప్రముఖ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన చిత్రం ‘పిశాచు-2’. విజయ్ సేతుపతి పూర్ణ సంతోష్ ప్రతాప్ కీలక పాత్రల్లో నటించారు.రాక్ఫోర్ట్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై టి. మురుగనాథమ్ నిర్మించారు `పిశాచి` చిత్రానికిది సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. 

తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.. అరణ్మనై అరణ్మనై 2 చిత్రాల్లో నటించిన ప్రేక్షకుల్ని తనదైన నటనతో భయపెట్టిన ఆండ్రియా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాలో 15నిమిషాల నిడివితో ఉండే ఓ సీన్‌లో ఆండ్రియా న్యూడ్‌గా నటించినట్లు వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కథ డిమాండ్‌ మేరకు 15నిమిషాల పాటు వివిస్త్రగా నటించాలని దర్శకుడు కోరగా, తొలుత ఆండ్రియా అందుకు నిరాకరించినట్లు సమాచారం. కానీ కథ కోసం ఆమె న్యూడ్‌గా నటించిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది సినిమా రిలీజ్‌ అయ్యాక తెలియనుంది.గతంలోనూ ఆండ్రియా  ‘వడ చెన్నై’ చిత్రంలో బోటులో చిత్రీకరించిన సన్నివేశాల్లో వివస్త్రగా నటించింది. అయితే ఆ తర్వాత ఆ సీన్స్‌ను తొలగించారు. 

మరిన్ని వార్తలు