Plan B: ‘ప్లాన్‌ బి’ ట్రైలర్‌కి 1 మిలియన్ వ్యూస్‌

15 Sep, 2021 19:10 IST|Sakshi

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ 'ప్లాన్ బి'. కేవీ రాజమహి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందించాడు. ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్‌పై ఏవీఆర్ నిర్మిస్తున్నాడు. డింపుల్ హీరోయిన్. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.

కాగా ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ‘1 మిలియన్ వ్యూస్‌తో మా మూవీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా ఉంది.  ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ అంశాలను మేళవించి తెరకెక్కించిన ఈ చిత్రం అందరిని థ్రిల్ కి గురిచేయడం ఖాయం’ అని చిత్ర దర్శక నిర్మాతలు అన్నారు. కాగా ఈ టీజర్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు