రాజకీయాల్లో రాణించాలి: చిరంజీవి

12 Dec, 2020 11:02 IST|Sakshi

నేడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 70 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని తమినాడు వ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లో నేరుగా రంగ ప్రవేశం చేయనున్నట్లు గతవారం పేర్కొన్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 31న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నట్లు వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో శనివారం నాటి రజనీకాంత్‌ 70వ జన్మదినోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయమే మక్కల్‌ మన్రం( రజనీ అభిమాన సంఘం) నిర్వాహకులు భారీ ఎత్తున అభిమానులు ఆయన ఇంటికి చేరుకొని బ్యానర్లు, రజనీ ఫోటోతో ప్రింట్‌ చేసిన టీ షర్టులను ధరించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: ఢిల్లీలో తిష్ట వేసిన రజనీకాంత్‌..

కాగా రజనీకాంత్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించిన ప్రధాని.. ‘ప్రియమైన రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. అలాగే టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీ.. రజనీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ప్రియమైన స్నేహితుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అద్భుతంగా జీవించాలని, రాజకీయాల్లో విజయాలు సాధించాలని కోరుకుటున్నాను. మీ ప్రత్యేక శైలి ద్వారా ఎన్నో మిలియన్ల హృదయాలను గెలుచుకున్నారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రత్యేక స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నాను. అని పేర్కొన్నారు. చదవండి: కొత్త పార్టీ: రజనీకాంత్‌ కీలక ప్రకటన

ఇక తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ కూడా శుక్రవారమే రజనీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఇదిలా ఉండగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది (2021) జరగనున్నాయి. ఈ క్రమంలో  రజనీ రాజకీయ ప్రవేశం విషయం కేవలం సినిమా రంగంలోనే కాకుండా తమిళనాడు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపులో రజనీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని ప్రార్ధిస్తూ మక్కల్‌ మన్రం నిర్వాహకులు ఎన్నూరులోని శ్రీ అంకాళ పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక యాగాన్ని నిర్వహించారు. చదవండి: రజనీ‌ పార్టీ చిహ్నంగా సైకిల్‌ గుర్తు!?
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

>
మరిన్ని వార్తలు