Megastar Chiranjeevi: చిరంజీవిని అభినందించిన మోదీ.. తెలుగులో ట్వీట్‌

21 Nov, 2022 14:32 IST|Sakshi

టాలీవుడ్ ‍అగ్ర నటుడు చిరంజీవికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్రమోదీ మెగాస్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. చిరుకు ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022 అవార్డు రావడం పట్ల మోదీ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగులో ట్వీట్‌  చేశారు. అవార్డుకు ఎంపికైనందుకు మెగాస్టార్‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. 

ట్వీట్‌లో మోదీ ప్రస్తావిస్తూ..  'చిరంజీవి ఒక విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానం, ఆదరణ చూరగొన్నారు'. అంటూ పోస్ట్ చేశారు. గోవాలో జరుగుతోన్న అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్-2022 అవార్డుకు మెగాస్టార్ ఎంపికయ్యారు. పనాజీలో ఆదివారం ప్రారంభమైన ఇఫి వేడుకలు ఈ నెల 29 వరకు జరగనున్నాయి. మంచి కంటెంట్‌తో రూపుదిద్దుకున్న దాదాపు 280 చిత్రాలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన ప్రముఖులకు పురస్కారాలు అందిస్తారు.

మరిన్ని వార్తలు