వాణీ జయరాం మరణంపై అనుమానాలు..!

4 Feb, 2023 16:12 IST|Sakshi

ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.  చెన్నైలోని ఆమె ఇంటిని స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పని మనిషి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె ఇంటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరీశీలిస్తున్నారు. ఆమెది సాధారణ మృతి కాదని, ఎవరో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాలింగ్ బెల్‌ కొట్టినా తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్లినట్లు పనిమనిషి పోలీసులకు తెలిపింది. ఇటీవలే ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్‌ పురస్కారం ప్రకటించి గౌరవించింది. 

మరిన్ని వార్తలు