Asian Film Awards: ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్

6 Jan, 2023 21:11 IST|Sakshi

ఆర్ఆర్ఆర్, పొన్నియిన్ సెల్వన్- పార్ట్ చిత్రాలు ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌ నామినేషన్స్‌లో సత్తా చాటాయి.  పొన్నియిన్ సెల్వన్ 6 నామినేషన్లు, ఆర్ఆర్ఆర్ పలు విభాగాల్లో నామినేట్ అయ్యాయి. మార్చి 12న హాంకాంగ్‌లో జరగనున్న 16వ ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్‌కు సంబంధించిన నామినేషన్లను శుక్రవారం ప్రకటించారు. 

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్- 1 ఉత్తమ చిత్రంతో సహా ఆరు విభాగాలలో నామినేట్ అయింది. ఎస్ఎస్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ఆర్ఆర్ఆర్ కూడా రెండు విభాగాల్లోకి పోటీలో నిలిచింది.  బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సౌండ్ విభాగాల్లో నామినేట్ అయింది. 

రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్- శ్రీనివాస్ మోహన్, ఉత్తమ సౌండ్- అశ్విన్ రాజశేఖర్ నామినేట‍్ అయ్యారు. ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా అనేక ఉత్తమ  జాబితాల్లో చోటు దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట కూడా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చేరింది. 

మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్- 1 థియేటర్లలో రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్‌గా శ్రీకర్ ప్రసాద్, ఉత్తమ సినిమాటోగ్రఫీగా రవి వర్మన్, ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్‌గా ఎ.ఆర్. రెహమాన్, ఉత్తమ సంగీతానికి ఏకా లఖాని, ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్‌గా కాస్ట్యూమ్ డిజైన్ తోట తరణి విభాగాల్లో నామినేషన్స్ లభించాయి.

మరిన్ని వార్తలు