Maniratnam: ​ఆయనొక అద్భుతం.. కానీ అంతకు మించిన టాలెంట్ ఉంది: మణిరత్నం 

21 Sep, 2022 17:26 IST|Sakshi

కోలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో హిట్‌ చిత్రాలకు పనిచేసిన పాటల రచయిత 'వైరముత్తు'. అంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నా ఆయన.. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పలు చిత్రాలకు గతంలో సాహిత్యమందించారు. వైరముత్తు పాటలు సినీ ప్రియుల్ని కట్టిపడేసేలా ఉంటాయి. మరీ తాజాగా మణిరత్నం రూపొందించిన కొత్త చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో మాత్రం వైరముత్తు ఎందుకు లేరు. దీనికేమైనా ప్రత్యేక కారణాలున్నాయా అన్న చర్చ నడుస్తోంది. అయితే  ఇటీవల జరిగిన ఓ సమావేశంలో అడిగిన ప్రశ్నకు తాజాగా మణిరత్నం స్పందించారు.

'వైరముత్తు టాలెంట్‌ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సైతం వైరముత్తు టాలెంట్‌ను మెచ్చుకునేవారు. నేను ఆయనతో కలిసి ఎన్నోసార్లు పనిచేశా. ఆయన సాహిత్యాన్ని నా సినిమాల్లో ఉపయోగించా. అతనొక అద్భుతం. అయితే వైరముత్తును మించిన కొత్త టాలెంట్‌ ప్రస్తుతం పరిశ్రమలో ఉంది. కొత్త తరానికి ప్రోత్సాహమందించాలి’ అందుకే అని మణిరత్నం వివరణ ఇచ్చారు. గతంలో వైరముత్తుపై మీటూ ఆరోపణలు రావడంతో దూరం పెట్టారని కోలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి.

(చదవండి: పొన్నియిన్ సెల్వన్ ఆ నటితో చేద్దామనుకున్నా: మణిరత్నం)

అయితే గతంలో వైరముత్తు తమను వేధింపులకు గురి చేశాడంటూ  కొంతమంది మహిళలు ‘మీటూ’ వేదికగా ఆరోపించారు. ప్రముఖ గాయని చిన్మయి సైతం ఆయనపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే వైరముత్తుతో పనిచేసేందుకు పలువురు సినీ ప్రముఖులు వెనకాడుతున్నట్లు అప్పట్లోనే కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. మణిరత్నం, వైరముత్తు చివరి చిత్రం 'చెక్క చివంత వానం' (2018). ఈ చిత్రంలో 'మజై కురువి' 'భూమి భూమి' లాంటి హిట్ సాంగ్స్ ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ కోసం ఇళంగో కృష్ణన్  మూడు పాటలు, కబిలన్‌, శివ అనంత్‌, కృతికా నెల్సన్‌లు మరో మూడు పాటలు రాశారు. 
 

మరిన్ని వార్తలు