ఐశ్వరీ ఠాక్రేతో అలయ డేటింగ్‌, క్లారిటీ ఇచ్చిన నటి

11 May, 2021 19:12 IST|Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటి పూజ బేడీ ఐశ్వరీ ఠాక్రేతో తన కూతురు, నటి అలయ ఎఫ్‌ ప్రేమ వ్యవహరంపై స్పందించింది. జవానీ జానెమాన్‌తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన అలయా ఎఫ్‌ గత కొంతకాలంగా దివంగత శివసేన వ్యవస్థాపకులు బాల్‌ ఠాక్రే మనవడైన ఐశ్వరీ ఠాక్రేతో ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతేడాది అలయ తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఐశ్వరీ ఠాక్రేతో కలిసి దుబాయ్‌లో సందడి చేసిన ఫొటోలు వైరల్‌ అయ్యాయి. దీంతో అప్పటి నుంచి వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ బీ-టౌన్‌లో టాక్‌.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా బేడీ ఈ రూమర్స్‌పై మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో అలయకు సంబంధించిన ప్రతి విషయం వార్తల్లో నిలుస్తుందన్నారు. ‘అలయ వ్యక్తిగతం జీవితంపై, ఆమె ఎవరెవరితో డేటింగ్‌ చేస్తుంది ఇలా చాలా రూమర్స్‌ పుట్టుకొచ్చాయి. ఇప్పటికి తన డేటింగ్‌పై దాదాపు 7 వార్తలు చూశాను. ఆపై తను ఎవరితో ఉండాలనుకుంటుంది అనే ప్రశ్న కూడా తలెత్తింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుత రోజుల్లో నటిగా ఏ వయసులో ఎలా ఉండాలి అంటూ వారిని ఓ నిర్థిష్ట పద్దతిలో అంచనా వేయనవసరం లేదు. నా సమయంలో అయితే రిలేషన్‌షిప్‌లో లేని మహిళ ఖచ్చితంగా కన్య అయి ఉండాలి, అవివాహితురాలై ఉండాలి. కానీ ఇప్పటి కాలంలో అలాంటి పట్టింపులు లేవు.

కానీ ఇప్పుడ ఒక నటి వ్యక్తిగత జీవితాన్ని ఆనందంగా గడిపే హక్కు తనకుంది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇక హీరోయిన్‌ కరీనా కపూర్‌ను ఉద్దేశిస్తూ ఆమె  మాట్లాడుతూ... కరీనా చూడండి వివాహ ఆనంతరం ఆమె ఆనందంగా లేదాని, కాబట్టి ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. అలాగే సోషల్‌ మీడియా వల్ల ప్రేక్షకుల చూసే విధానంలో కూడా అనుహ్యా మార్పులు వచ్చాయంటూ పూజా స్పష్టత నిచ్చింది. అయితే అలయ ఐశ్వరీ ఠాక్రేతో పలు విందువినోదాలకు, లేట్‌నైట్‌ డిన్నర్లకు వెళ్లడం, అంతేగాక ఈ ఏడాది ప్రారంభంలో ఐశ్వరీతో పాటు అతడి తల్లి స్మిత ఠాక్రేతో కలిసి ఆమె ఓ రెస్టారెంట్‌కు వెళ్లడంతో వీరిద్దరి రిలేషపై వస్తున్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అంతేగాక ఆ మధ్య  అలయ ఐశ్వరీ  తన ఫ్యామిలీ ఫ్రెండ్‌ అంటూ చేసిన కామెంట్లను కొట్లిపారెసిన సంగతి తెలిసిందే. 

చదవండి: 
నా లోపం చాలా చిన్నది, అందుకే వద్దనుకున్న: అలయ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు