18 ఏళ్లకే ఫస్ట్‌ కిస్‌, నాన్న ప్రోత్సాహంతోనే: పూజా భట్

1 Apr, 2021 09:37 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత మహేష్‌ భట్‌ కూతురు పూజా భట్‌ 18 ఏళ్లకే తన ఫస్ట్‌ కిస్‌ అనుభవాన్ని చుశానని పేర్కొన్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేరీర్‌ ప్రారంభంలోని సంగతులను గుర్తు చేసుకున్నారు.  ఈ సందర్భంగా ఆమె నటించిన ‘సడక్’‌ చిత్రంలోని ఓ ముద్దు సన్నివేశం గురించి వివరించారు. ఆ సీన్‌లో నటించేందుకు తను ఇబ్బంది పడుతుంటే తన తండ్రి(మహేష్‌ భట్‌) దగ్గరుండి ఆ సన్నివేశాన్ని చేయించారన్నారు. 

‘సడక్‌ మూవీ చేస్తున్న సమయానికి నాకు 18 ఏళ్లు. ఈ సినిమాలో ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు భయంతో వణికిపోయాను. నాన్న ముందు ఆ సీన్‌ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. దీంతో నాన్న నన్ను పక్కకు తీసుకెళ్లి నువ్వు ముద్దును వల్గర్‌గా ఫీల్‌ అయ్యావంటే అందులో నీకు వల్గారిటియే కనిపిస్తుంది. అదే నువ్వు ముద్దు సన్నివేశాన్ని గౌరవించి.. ఎంత ఇష్టంతో నటిస్తే ఆ సన్నివేశం అంతబాగా పండుతుంది. కథలో భాగంగా ప్రతి సీన్‌లోని ఇంటెన్షన్‌ తెలుసుకోవాలని’ చెప్పారని పేర్కొన్నారు. 

అలా తన తండ్రి మహేష్‌ భట్‌ ప్రోత్సాహంతో ముద్దు సీన్‌లో నటించగలిగానని, అప్పుడు ఆయన చెప్పిన మాటలను ఇప్పటికి గుర్తుచేసుకుంటూ కెమెరా ముందు నిబద్ధతతో నటిస్తుంటానని పూజా తెలిపారు. కాగా పూజా భట్‌ 1991 చిత్రం సడక్‌తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో సంజయ్‌ దత్‌కు ఆమె హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీకి ఆమె తండ్రి మహేష్‌ భట్‌ దర్శకత్వం వహించారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన పూజా భట్‌ ఇటీవల 'బాంబే బేగమ్స్' అనే వెబ్‌ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇచ్చారు. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న నెట్‌ ఫ్లిక్స్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ విడుదలైంది.

చదవండి: 
ట్రెండింగ్‌: స‌డ‌క్ 2కు డిస్‌లైకుల వ‌ర్షం

మరిన్ని వార్తలు