Pooja Hegde: పూజా హెగ్డే ఖాతాలో అరుదైన రికార్డు

1 Sep, 2021 13:19 IST|Sakshi

Pooja Hegde Instagram Followers: ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే అరుదైన రికార్డు సాధించింది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌ చిట్‌చాట్‌ నిర్వహిస్తు నిత్యం ఫ్యాన్స్‌ను పలకరించే ఈ బుట్టబొమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. దీంతో పూజా సోషల్‌ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటోంది. తన హేర్‌ స్టైలిస్ట్‌, మేకప్‌ అర్టిస్ట్‌ కాజోల్‌, కుక్‌, అసిస్టెంట్‌, కుక్‌ అసిస్టెంట్స్‌లను కూడా తన సంతోషంలో భాగం చేస్తూ ఓ వీడియో షేర్‌ చేసింది.

చదవండి: అమెజాన్‌ ప్రైంలోకి ‘పాగల్‌’ మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

దీనికి ‘ఇన్‌స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నా క్రేజీ టీంను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. వీరంతా నన్ను నవ్విస్తారు, జాగ్రత్తగా చూసుకుంటారు. నేను అనారోగ్యం బారిన పడకుంటా చూసుకుంటుంటారు. అలాగే నేను అందంగా కనిపించేలా చేస్తారు’ అంటూ రాసుకొచ్చింది. అంతేగాక తను ఈ మైలు రాయి చేరుకోవడంలో సహాయం చేసిన ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌కు పూజా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది. 

చదవండి: నాకు మత్తు ఇచ్చి పోర్న్‌ వీడియో తీశారు: మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌

కాగా ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే.  ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఇక్కడ సూపర్ హిట్‏గా నిలిచింది. ఈ క్రమంలో ఆమె టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. తాజాగా ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా విడుదలకు సిద్ధంగా కాగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు తమిళంలో స్టార్ హిర్ విజయ్ సరసన నటిస్తోంది. ఇలా చేతినిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఈ బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరడం నిజంగా విశేషమే. 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు