ఆచార్య: 20 నిమిషాల కోసం రూ. కోటి

28 Jan, 2021 15:13 IST

ముంబై భామ పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో పట్టిందంతా బంగారమే అవుతోంది. గతేడాది అలవైకుంఠపురములో సినిమాతో విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుసపెట్టి ఆఫర్లు వచ్చి వాలుతున్నాయి. ఇప్పటికే పూజా నటించిన మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ప్రభాస్‌తో కలిసి రాధే శ్యామ్‌ చిత్రంలో నటిస్తోంది. హిందీలో సల్మాన్‌ ఖాన్‌ తో ‘కభీ ఈద్‌ కభీ దీవాలి’, రణ్‌వీర్‌ సింగ్‌తో ‘సర్కస్‌’ చేస్తోంది. వీటితోపాటు మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ ఈ బుట్టబొమ్మ తళుకున్న మెరవనున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌ నటించనుండగా..ఆయన తనయుడు రామ్‌ చరణ్‌కు జోడీగా పూజా నటించనుంది. చదవండి: ఆ హీరోయిన్‌ కావాలంటున్న త్రివిక్రమ్‌!

ఇదిలా ఉండగా వచ్చే అవకాశాలకు తగ్గట్టుగానే పూజా తన రెమ్యూనరేషన్‌ను కూడా సెట్‌ చేసుకుంటోంది. ఆచార్య స్క్రీన్‌ మీద ఆమె పాత్ర కేవలం 20 నిమిషాలే ఉండనుంది. అయితే సమయంతో సంబంధం లేకుండా 20 నిమిషాల పాత్ర కోసం పూజా కోటి రూపాయలు తీసుకోబోతుందటా. వినడానికి కొంచెం ఆశ్యర్యంగానే ఉన్నా ఇదే నిజం. ఇప్పుడు ఈ భామకు ఉన్న డిమాండ్‌ అలాంటిది మరి. ఇక ఆచార్యలో అందరూ బడా స్టార్స్‌ నటిస్తుండటంతో తను కూడా భారీగానే రెమ్యూనరేషనర్‌ తీసుకోవాలని పూజా భావించి కోటి డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు చిత్ర యూనిట్‌ కూడా సుముఖంగానే ఉండటంతో అక్షరాల కోటి రూపాయలకు ఆమెకు సమర్పించుకోనున్నారు. మరి అంత మొత్తంలో అందుకున్న పూజా క్యారెక్టర్‌ సినిమాలో ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆచార్య విడుదలయయ్యే వరకు వేచి చూడాలి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. మే 7 విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు