పూజా హెగ్డే తొలి సంపాదన ఎంతో తెలుసా?

27 Apr, 2021 19:53 IST|Sakshi

పూజా హెగ్డే.. టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ హీరోయిన్లలో ఒకరు. ‘ అల వైకుంఠపురములో’ తర్వాత ఈ బుట్టబొమ్మ రేంజ్‌ మారిపోయింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ బ్యూటీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి లాంటి పెద్ద హీరోలతో పాటు అఖిల్‌ లాంటి యంగ్‌ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంది. అఖిల్‌ ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ సినిమాతో పాటు చిరంజీవి ‘ఆచార్య’లో రామ్‌చరణ్‌ సరసన నటిస్తోంది. అలాగే ప్రభాస్‌తో పాన్‌ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్‌’లోనూ ఈమే హీరోయిన్‌. వీటితో పాటు సల్మాన్ ఖాన్ సరసన ‘కభీ ఈద్ కభీ దీవాళీ’ సినిమాలో నటిస్తోంది.

ఇలా టాలీవుడ్‌, బాలీవుడ్‌ అని తేడా లేకుండా దూసుకెళ్తున్న ఈ బుట్టబొమ్మ.. రెమ్యునరేషన్‌న్ని కూడా అంతే వేగంగా పెంచేసింది. ‘అల వైకుంఠపురము’కు రూ.1.4 కోట్లు తీసుకున్న పూజ.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల నుంచి నూ. 5 కోట్ల వరకు వసూలు చేస్తోందట. ప్రస్తుతం సౌత్‌లో రెమ్యునరేషన్ విషయంలో నయనతారతో పోటీ పడుతున్న ఈ భామ.. తొలి సంపాదన ఎంతో తెలిస్తే షాకవుతారు.

ఈ బ్యూటీ తొలిసారిగా జీవా హీరోగా నటించిన ‘మూగముడి’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అంతకు ముందు మోడల్‌గా పనిచేసిన పూజా హెగ్డే.. ఈ సినిమా కోసం రూ. 30 లక్షల పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. అలా తొలిసారి వచ్చిన సంపాదనతో పూజా హెగ్డే బీఎమ్‌డబ్లూ‍్య5 (BMW5) సిరీస్ బ్యూ స్టోన్ సిల్లర్ కలర్ కారును కొనుగోలు చేసిందంట. ఇప్పటికే ఈ కారు పూజా హెగ్డే దగ్గర ఉంది. తొలిసారి తన సంపాదనతో కొన్ని ఆ కారు అంటే పూజాకు ప్రాణం అట. ఆ కారును పూజా హెగ్డే ఎంతో అపురూపంగా చూసుకుంటుందట. ఇక తనకు వచ్చిన డబ్బులను దుబారాగా ఖర్చు చేయకుండా వెంటనే తీసుకెళ్లి వాళ్ల అమ్మ చేతిలో పెట్టేస్తుందట. ఆ డబ్బుతో ఏం చేయాలనే నిర్ణయం వాళ్ల అమ్మదేనని ఓ ఇంటర్వ్యూలో పూజాహెగ్డే చెప్పింది. 

మరిన్ని వార్తలు