అందుకోసం చాలా కష్టపడ్డాను, అయినప్పటికీ: పూజా హెగ్డే

16 May, 2021 00:43 IST|Sakshi
పూజా హెగ్డే

‘‘స్టాండప్‌ కమెడియన్‌గా చేయడం అంత సులువేం కాదు’’ అంటున్నారు పూజా హెగ్డే. అఖిల్‌ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రంలో స్టాండప్‌ కమెడియన్‌ వైభ పాత్రలో నటించారు పూజా హెగ్డే. ఈ పాత్ర చేయడానికి ఎలాంటి కృషి చేశారో పూజా హెగ్డే చెబుతూ – ‘‘రోజుల తరబడి చేసిన సాధనను ఒక గంటలోనో, అరగంటలోనో వేదికపై స్టాండప్‌ కమెడియన్స్‌ ప్రదర్శించాల్సి ఉంటుంది. పంచ్‌ లైన్స్‌తో వీక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ చిత్రం స్టాండప్‌ కామేడీ బేస్‌ మీద తీస్తున్నది కాదు. బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీ. ఈ సినిమాలో నా పాత్ర స్టాండప్‌ కమెడియన్‌.

సన్నివేశాలకు అవసరమైనంతవరకు మాత్రమే నా స్టాండప్‌ కామెడీ స్కిల్స్‌ను చూపించాలి. ఇందుకోసం తీవ్రంగా శ్రమించాను. ముఖ్యంగా చాలామంది స్టాండప్‌ కమెడియన్స్‌ని కలిసి మాట్లాడాను. స్టేజ్‌పై వారు సందర్భానుసారంగా విసిరే పంచ్‌లు, వ్యూయర్స్‌కి తగ్గ రియాక్షన్స్‌ ఇవ్వడం వంటి వాటి గురించి వారితో చర్చించాను. అందుకే బాగా నటించగలిగాను. అయితే నటించడం మొదలుపెట్టాక స్టాండప్‌ కమెడియన్‌ రోల్‌ చేయడం నేననుకున్నంత సులువేం కాదని అర్థమయింది’’ అని పేర్కొన్నారు. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో మరో ఇద్దరు లేడీ స్టాండప్‌ కమేడియన్స్‌ కోసం దాదాపు వందమందిని ఆడిషన్‌ చేశారట. ఈ చిత్రం జూన్‌ 19న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు