'నీ వల్లే నీ వల్లే' మెలోడీ సాంగ్ విడుదల

14 Aug, 2021 12:39 IST|Sakshi

సుశాంత్, మీనాక్షి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్‌’ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్‌ పతాకాలపై రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల  సంయుక్తంగా నిర్మించారు.

తాజాగా ఈ సినిమా నుంచి “నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్‌ను హీరోయిన్‌ పూజా హెగ్డే రిలీజ్‌ చేసింది. వాస్తవ ఘటనల ఆధారంగా హిలేరియస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్‌.

మరిన్ని వార్తలు