ఆయ‌న‌కు నేనో పెద్ద ఫ్యాన్‌: థ్రిల్‌ అవుతున్న పూజా

31 Oct, 2020 18:36 IST|Sakshi

బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే చేతిలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ప్ర‌భాస్‌తో క‌లిసి ఫిక్ష‌న‌ల్ రొమాంటిక్ రాధేశ్యామ్ చేస్తుండ‌గా, అఖిల్‌తో క‌లిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా చేస్తున్నారు. అటు బాలీవుడ్‌లోనూ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌తో క‌లిసి స‌ర్క‌స్ అనే కామెడీ చిత్రంలో న‌టించ‌నున్నారు. ఇది ‘అంగూర్‌’ (1982) చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. దీనికి ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌ర్క‌స్ చిత్రంలో భాగ‌స్వామ్యం అవుతున్నందుకు పూజా హెగ్డే ఎప్పటి నుంచో  తెగ ఎక్జైట్ అవుతోంది. ఈ క్ర‌మంలో ఆమె సోష‌ల్ మీడియాలో తాజాగా ఓ పోస్టు పెట్టింది. (చ‌ద‌వండి: నాకు  కాబోయేవాడు నా షూ‌తో సమానం)

"నేను రోహిత్ స‌ర్‌కు వీరాభిమానిని. ఆయ‌న త‌న సినిమాల ద్వారా ప్ర‌పంచానికి వినోదాన్ని అందిస్తున్నారు. సింగ‌మ్‌, సింబా, మ‌రేదైనా కానీ, ఆయ‌న సినిమాలు చూస్తున్నంత‌సేపు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. అలాంటిది రోహిత్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నానంటే సంతోషం ప‌ట్ట‌లేకున్నాను. షూటింగ్ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా అని ఎదురు చూస్తున్నాను" అని పూజా రాసుకొచ్చారు. ఈ సినిమాలో ఆరంభం నుంచి చివరి వరకూ ఫుల్‌ కామెడీ ఉంటుందంటున్నారు. ర‌ణ్‌వీర్ కూడా డ‌బుల్ యాక్ష‌న్ చేస్తున్నార‌ట‌. కాగా పూజా బాలీవుడ్‌లో మ‌రో చిత్రంలో కూడా మెర‌వ‌నున్నాను. "క‌బీ ఈద్ క‌బీ దివాళి"లో స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌తో జోడీ క‌ట్ట‌నున్నారు. (చ‌ద‌వండి: సోనూ సూద్‌, ప్లీజ్‌ మోనాల్‌ను కాపాడండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు