Pooja Hegde: పూజా హెగ్డే ఇంట పెళ్లి భాజాలు.. ఫొటోలు షేర్‌ చేసిన ‘బుట్టబొమ్మ’

30 Jan, 2023 10:54 IST|Sakshi

‘బుట్ట బొమ్మ’ పూజా హెగ్డే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ‘ఒకలైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ బ్యూటీ అనంతరం ముంకుందా, డీజే, మహర్షి, అరవింద సమేత, అలా వైకుంఠపురంలో చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.  ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఇదే క్రమంలో ఆమెకు బాలీవుడ్‌ ఆఫర్స్‌ సైతం క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో పలు చిత్రాలు చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా పూజ హెగ్డే ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆమె సోదరుడు రిషబ్‌ హెగ్డే వివాహం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. శివానీ శెట్టి అనే యువతితో అతడి పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో పూజా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయింది. ఈ వేడుకలో పూజా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను పూజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

‘మా అన్నయ్య ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేమను కలుసుకున్నాడు. ఈ వారం అంతా చాలా ఉరుకులు పరుగులుగా గడిచింది. మా ఇంట పెళ్లి సందడి మొదలైనప్పటి నుంచి నేను చిన్న పిల్లలా నవ్వుతూ.. ఆనందంతో కన్నీళ్లు పెట్టాకుంటూనే ఉన్నాను’ అంటూ బుట్ట బొమ్మ ఎమోషనల్‌ అయ్యింది. ఈ సందర్భంగా తన జీవితంలో మరో ఫేజ్‌కు వెళ్లిన తన అన్నయ్య పూజా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపింది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

A post shared by Pooja Hegde (@hegdepooja)

చదవండి: 
తారకరత్న గురించి గుడ్‌న్యూస్‌ చెప్పిన మంచు మనోజ్‌
నయనతార భర్త విగ్నేశ్‌ శివన్‌కు షాక్‌ ఇచ్చిన స్టార్‌ హీరో

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు