Pooja Hegde: లైవ్‌చాట్‌లో పూజ హెగ్డేకు షాకింగ్‌ ప్రశ్న, నెటిజన్‌కు హీరోయిన్‌ చురక

19 Oct, 2021 14:53 IST|Sakshi

పూజా హెగ్డే.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.  వరుసగా స్టార్‌ హీరోల సరసన అవకాశాలను అందిపుచ్చకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా తెలుగులో చక్రం తిప్పుతోంది. ఇటీవల ఆమె నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ విడుదలైన సంగతి తెలిసిందే. దసరా పండుగా సందర్భంగా థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో పూజ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. ఆస్క్‌ మీ ఎనిథింగ్‌ పేరుతో ట్విటర్‌లో లైవ్‌చాట్‌ నిర్వహించింది.

చదవండి: మెగాస్టార్‌ మెస్సేజ్‌ చేశారు.. విజయ్‌ ఎంతో స్వీట్‌: పూజా హెగ్డే

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు పూజ ఓపికగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఓ నెటిజన్‌ నుంచి ఆశ్చర్యకరమైన ప్రశ్న ఎదురవగా అతడికి ఈ బుట్టబొమ్మ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో పూజ తెలివైన రిప్లై చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఇంతకి సదరు ఫ్యాన్‌ అడిగిన ప్రశ్న ఎంటంటే.. ‘మన రిలేషన్‌ను ఎప్పుడు పబ్లిక్‌ చేద్దాం’ అని అడగ్గా దానికి పూజ  ‘రక్షాబంధన్‌ రోజున’ అంటూ అతడికి చురక అట్టించింది. 

ఇక ట్విట్టర్‌ తనకు ఎదురైన మరిన్ని ప్రశ్నలు ఎంటంటే..

ఫ్యాన్‌: జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ఒక్క మాటలో..
పూజ: ఆయన ‘నిజం’ అని సమాధానం ఇచ్చింది. 

మీ ఫ్యాన్స్‌ గురించి..!
నన్ను బాగా చూసుకుంటారు!

పెద్ద సినిమాలు.. పెద్ద హీరోలతో నటిస్తున్నారు. సమయం ఎలా అడ్జెస్ట్‌ చేస్తున్నారు...
‘తక్కువగా నిద్రపోతూ తరచూ విమానాలు ఎక్కుతున్నా. అందుకు సినిమానే కారణం. నిజం చెప్పాలంటే నాకు పనిచేయడమంటే ఇష్టం. చాలా ఆత్రుతగా ఉంటా. నిరంతరం పనిలో ఉండటం వల్ల ప్రయోజనం ఏంటంటే..తక్కువ మాట్లాడతాం’ అంటూ నవ్వుతూ వివరించింది. 

రాధేశ్యామ్‌ గురించి చెప్పండి?
రాధేశ్యామ్ ఓ ఎపిక్ లవ్ స్టోరీ. అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. 

తమిళ హీరో విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పండి..
ఒక్క మాటలో చెప్పడం కష్టం. ఆయన స్వీటెస్ట్ పర్సన్ అని పేర్కొంది. అలాగే, కన్నడ ఇండస్ట్రీని కేజీఎఫ్ హీరో యశ్ గర్వించేలా చేశాడని ఆమె చెప్పింది.

ఎవరితో కలిసి నటించటం మీ కల?
ఒకే ఒక్కరు అమితాబ్‌ బచ్చన్‌ సర్‌. ఏదో ఒక రోజు నా కల సాకారం అవుతుంది.

‘ఆచార్య’లో చిరంజీవితో పనిచేయడం ఎలా అనిపించింది?
ఇప్పుడే చెప్పలేను. కానీ, చిరంజీవిగారు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చూసి, నన్ను అభినందిస్తూ సందేశం పంపారు. మరింత కష్టపడిన పనిచేయాలని ఆ సందేశం నాలో స్ఫూర్తినింపింది.

‘కె.జి.యఫ్‌’ హీరో యశ్‌ గురించి ఒక్క మాటలో..!
కన్నడ ఇండస్ట్రీని గర్వించేలా చేశాడు.

ఒత్తిడిని ఎలా జయిస్తారు? అందుకు మీరు ఏం చేస్తారు? నాకు తెలుసుకోవాలని ఉంది.
సంగీతమే నా ఒత్తిడి తగ్గించే థెరపీ. అదే నా బెస్ట్‌ ఫ్రెండ్‌. నేను నిరాశలో ఉన్నప్పుడు ఎక్కువగా సంగీతం వినేదాన్ని. మనసులో ఏదీ పెట్టుకోకుండా ఏడవటం కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఐదు నిమిషాల్లో ఇవన్నీ చేసి, మళ్లీ పనిలో నిమగ్నమవుతా.

మరిన్ని వార్తలు