Pooja Hegde: సమాజానికి మనం కూడా తిరిగి ఇవ్వాలి

21 Jul, 2021 00:03 IST|Sakshi

‘‘సమాజం మనకు ఎంతో ఇచ్చినప్పుడు మనం కూడా తిరిగి ఇవ్వాలి’’ అంటున్నారు పూజా హెగ్డే. అందుకే ‘ఆల్‌ ఎబౌట్‌ లవ్‌’ అనే ఫౌండేషన్‌ను ఆరంభించారామె. ఈ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ – ‘‘సమాజానికి సేవ చేయడానికి ‘ఆల్‌ ఎబౌట్‌ లవ్‌’ ఓ చిన్న మార్గంలా భావిస్తున్నాను. ఒకరి జీవితంలో మంచి మార్పు తెచ్చే స్థితిలో నన్ను చేర్చిన ప్రజలకు నా కృతజ్ఞతలు. చిన్నదో.. పెద్దదో.. ఏదో ఒకటి సమాజానికి చేయాలన్నదే నా ఆశయం. ప్రేమ అనేది ఒక శక్తిమంతమైన భావోద్వేగం అని నమ్ముతాను. ప్రేమతో చేసే ఏ సేవ అయినా ప్రపంచంలో మంచి మార్పుకి కారణం అవుతుందని కూడా నమ్ముతాను.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి, వైద్య సహాయం కావాలనుకున్నవారికి నా ఫౌండేషన్‌ హెల్ప్‌ చేస్తుంది’’ అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే... తెలుగులో ‘రాధేశ్యామ్‌’, ‘ఆచార్య’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, తమిళంలో ‘బీస్ట్‌’, హిందీలో ‘సర్కస్‌’, సల్మాన్‌ ఖాన్‌తో ఒక సినిమా చేస్తున్నారామె. అలాగే ఎన్టీఆర్‌–కొరటాల శివ సినిమాలో, రామ్‌చరణ్‌– శంకర్‌ సినిమాలో, ధనుష్‌–శేఖర్‌ కమ్ముల చిత్రంలోనూ పూజా హెగ్డేని కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. ఈ మూడు సినిమాల్లో పూజా లిస్ట్‌లో ఏ సినిమా చేరుతుందో?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు