హీరోల విషయంలో ఎందుకు నోరు మెదపరు : పూజా హెగ్డే

31 Jul, 2021 16:57 IST|Sakshi

హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్‌ విషయంలో చాలా వ్యత్యాసం ఉటుందన్న విషయం అందరికి తెలిసిందే. హీరోలతో పోల్చితే హీరోయిన్ల పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. స్టార్‌ హీరోయిన్లకి సైతం ఓ మామూలు హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్‌ ఇవ్వరనేది పచ్చి నిజం. ఇటీవల కాలంలో హీరోయిన్ల పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఎక్కువగా వస్తుండడంతో, వారి పారితోషికం కూడా కొంచెం పెరిగిందనే చెప్పాలి. అయినప్పటికీ హీరోలతో పోలిస్తే.. వారు పుచ్చుకునేది తక్కువేనని చాలా మంది వాదిస్తుంటారు. అందులో వాస్తవం కూడా ఉంది.

ఇక ఓ స్టార్‌ హీరోయిన్‌ కొంచెం రెమ్యునరేషన్‌ పెంచిందంటే చాలు.. అది హాట్‌ టాపిక్‌ అయిపోతుంది. తాజాగా కరీనా కపూర్‌ విషయంలో కూడా అదే జరిగింది. ఈ బాలీవుడ్‌ బ్యూటీ త్వరలో రానున్న ఓ పాన్‌ ఇండియా మైథలాజికల్‌ సినిమాలో సీత పాత్ర పోషించేందుకు రూ.12 కోట్లు డిమాండ్‌ చేసిందట. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. కరీనాను ఆ సినిమా నుంచి తొలగించాలంటూ..  ‘బాయ్‌కాట్‌ బెబో’అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ చేశారు. దీంతో ఇండస్ట్రీకి చెందిన పలువురు కరీనాకు మద్దతుగా నిలిచారు.

రెమ్యునరేషన్‌ పెంచడం, తగ్గించడం ఆమె వ్యక్తిగత విషయమని, దానికి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ..ప్రియమణి, తాప్సీ ఇప్పటికే కరీనాకు మద్దతు ప్రకటించారు. తాజాగా బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఆ లిస్ట్‌లో చేరింది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ..  కరీనాకు ఎంత మార్కెట్‌ ఉంటే అంతే అడిగిందని, అలా అడగడంలో తప్పులేదని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. హీరోయిన్ల రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడేవారు, హీరోలు పెద్ద మొత్తం డిమాండ్‌ చేస్తే ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించింది. రెమ్యునరేషన్‌ డిమాండ్‌ చేయడం నటుల హక్కు అని, ఎంత ఇవ్వాలనేది  నిర్మాత ఇష్టంపై ఆధారపడి ఉటుందని చెప్పుకొచ్చింది. బుట్టబొమ్మ చెప్పింది కూడా నిజమే మరి.

మరిన్ని వార్తలు