ఈటల రాజేందర్‌పై పూనమ్‌ కౌర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

20 Nov, 2021 14:05 IST|Sakshi

నటి పూనమ్‌ కౌర్‌ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ఎప్పుడు, ఎవరి మీద కామెంట్స్‌ చేస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకు చేస్తుందో కూడా తెలియదు. తాజాగా ఈ పంజాబీ బ్యూటీ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈటల చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గెలుపోటముల గురించి తాజాగా పూనమ్ స్పందించింది.

A post shared by Poonam kaur (@puunamkhaur)

గురునానక్‌ జయంతి సందర్భంగా ఈటలను ప్రత్యేకంగా కలిసి ఏక్ ఓంకార్ అనే తన మతంలో పవిత్రమైన గుర్తును కానుకగా ఇచ్చింది పూనమ్‌.  అంతేకాకుండా ఆయనతో కలిసి శాంతి కపోతమైనా పావురాన్ని ఎగుర వేసింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ధర్మ యుద్ధం ఎప్పుడూ గెలుస్తుందంని కామెంట్‌ చేసింది. అలాగే రైతు చట్టాలు రద్దు చేయడంతో మళ్లీ స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించిందని పూనమ్ కౌర్ అభిప్రాయపడింది. మొత్తానికి పూనమ్ కౌర్ ఇలా కనిపించడంతో నెటిజన్లకు కొత్త అనుమానాలు పుట్టుకొచ్చాయి. పూనమ్ కౌర్ కొంపదీసి బీజేపీలో చేరుతుందా? అని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు.

A post shared by Poonam kaur (@puunamkhaur)

మరిన్ని వార్తలు