Poonam Kaur: హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌కు పెళ్లయిందా? ఆ ఫోటో వైరల్‌

14 Oct, 2022 13:28 IST|Sakshi

సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా పాపులర్‌ అయ్యింది హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌. గత కొంతకాలంగా వెండితెరకు దూరమైన ఈ పంజాబి ముద్దుగుమ్మ నెట్టింట చేసే రచ్చ అంతా ఇంత కాదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్‌ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. కర్వాచౌత్‌ (Karwa Chauth)శుభాకాంక్షలు చెబుతూ చేతిలో జల్లెడను పట్టుకొని చంద్రుడిని చూస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పూనమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఇప్పడు దీనిపైనే తెగ చర్చ నడుస్తుంది. ఎందుకంటే తమ భర్త క్షేమాన్ని కోరుతూ కర్వాచౌత్‌ను పెళ్లయిన మహిళలే జరుపుకుంటారు. నార్త్‌లో ఈ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. భర్త పేరు మీద ఉపవాసం చేసి… జల్లెడలో చంద్రుడిని చూసిన వెంటనే భర్త ముఖాన్ని చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. 

అలాంటిది పెళ్లికాని పూనమ్‌ కర్వాచౌత్‌ ఫోటోను షేర్‌ చేయడంపై నెటిజన్లు సందేహాలు లేవనెత్తుతున్నారు. మీకు ఇదివరకే పెళ్లయిందా? లేదా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ పూనమ్‌ పోస్టుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

A post shared by Poonam kaur (@puunamkhaur)


 

మరిన్ని వార్తలు