తెలుగు హీరోయిన్‌ టీనేజ్‌ ఫోటో.. ఎవరో గుర్తుపట్టారా?

4 Feb, 2024 13:48 IST|Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌.. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్‌ అయింది. పూనమ్‌ తండ్రి సరబ్‌జిత్‌ సింగ్‌ పంజాబీ కాగా తల్లి సుఖ్‌ ప్రీత్‌ మాత్రం తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా. హైదరాబాద్‌లో జన్మించిన పూనమ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అంతా కూడా ఇక్కడే జరిగింది. ఆ తర్వాత  ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో  ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది.

తాజాగా పూనమ్‌ కౌర్‌ తన కాలేజ్‌ డేస్‌లోని యంగ్‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఆ ఫోటోలో తన అమ్మగారు కూడా ఉండటం విశేషం. నేడు తన తల్లి పుట్టినరోజు కావడంతో ఆ మధుర క్షణాలు గుర్తు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది.  రేర్‌ ఫోటోను షేర్‌ చేసిన పూనమ్ ఇలా చెప్పుకొచ్చింది. 'అమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

నీ మీద ఏదో ఒక రోజు పుస్తకం రాస్తాను.నీకు మహాసముద్రాలంటే ఇష్టం, నీ బలం శిఖరం లాంటిది. నాలో ఉన్న మంచి అంతా నీ నుంచే వచ్చింది. ఎందుకంటే నిన్ను చూస్తూనే పెరిగాను కాబట్టి. నువ్వు ఎంత బలంగా, అందంగా ఉంటావో నీకు తెలియదు. "కర్మ" సిద్ధాంతం నిజమైతే మిమ్మల్ని  బాధపెట్టిన వారందరూ కూడా నరకంలోని చీకట్లలో కుళ్ళిపోతారు. దానిని మీరు కూడా చూస్తారని నేను ఆశిస్తున్నాను. అని పూనమ్‌ తెలిపింది.

మొత్తానికి పూనమ్‌ కుటుంబం కొందరి వల్ల ఇబ్బందుల్లో పడటమో లేదా వారి వల్ల బాధించడమో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా తన అమ్మగారితో ఉన్న ఫోటోను పూనమ్‌ షేర్‌ చేయడంతో నెట్టింట్‌ వైరల్‌ అవుతుంది. యంగ్‌ ఏజ్‌లో పూనమ్‌ మరింత అందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. 2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలంతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

A post shared by Poonam kaur (@puunamkhaur)

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega