అశ్లీల వీడియో: పూన‌మ్ పాండేపై కేసు

4 Nov, 2020 15:49 IST|Sakshi

పనాజి: హాట్ మోడ‌ల్‌, బాలీవుడ్ న‌టి పూన‌మ్ పాండే మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. నిత్యం వివాదాల్లో నానుతూ ఉండే ఆమెపై తాజాగా కేసు న‌మోదైంది. గోవాలోని చ‌పోలీ డ్యామ్ వ‌ద్ద పూన‌మ్‌ అశ్లీల వీడియోను చిత్రీక‌రిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వీడియో చిత్రీక‌రించిన వ్య‌క్తితో స‌హా పూన‌మ్‌పైనా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. గోవా సంస్కృతి,‌ చ‌పోలీ డ్యామ్ ప‌విత్ర‌త‌ను దెబ్బ తీసేలా ప్ర‌వ‌ర్తించినందుకే కేసు పెట్టామ‌ని గోవా ఫార్వ‌ర్డ్ మ‌హిళా విభాగం పేర్కొంది. ఇక‌ ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పోర్న్‌ వీడియో గోవాలో వైర‌ల్‌గా మారింది. (చ‌ద‌వండి: టైటిల్‌లో మార్పులు.. కొత్త పోస్టర్‌ విడుదల)

కాగా పూన‌మ్ లాక్‌డౌన్‌లో త‌న ప్రియుడు సామ్‌బాంబేను పెళ్లి చేసుకున్నారు. సెప్టెంబ‌ర్ 1న‌ వైవాహిక జీవితాన్ని మొద‌లు పెట్టిన ఆమె భ‌ర్త‌ వేధిస్తున్నాడంటూ అదే నెల‌లో కేసు పెట్టారు. దీంతో గోవా పోలీసులు సెప్టెంబ‌ర్ 22న సామ్‌బాంబేను అరెస్టు చేయ‌గా మ‌రుస‌టి రోజే అత‌డికి బెయిల్ మంజూరైంది. ఇది జ‌రిగిన వారం రోజుల‌కే పూన‌మ్‌ మ‌న‌సు మార్చుకున్నారు. మేమిద్ద‌రం పిచ్చి ప్రేమ‌లో ఉన్నామంటూ మ‌ళ్లీ భ‌ర్త‌తో క‌లిసిపోయి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. (చ‌ద‌వండి: భర్త గురించి భయంకర విషయాలు చెప్పిన పూనమ్‌‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా