గర్భం దాల్చడం నా విషయంలో బాధాకర వార్త: పూనమ్‌

22 Jun, 2021 13:22 IST|Sakshi

అమ్మా అని పిలిపించుకోవాలని పెళ్లైన ప్రతి మహిళా కోరుకుంటుంది. పొత్తిళ్లలో పాపాయిని పడుకోబెట్టి ఆడించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటుంది. గర్భవతి అయ్యానన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆమె ఆనందం చెప్పతరం కాదనుకోండి. కానీ తనకు మాత్రం గర్భం దాల్చానని తెలుసుకోవడం బాధించే వార్త అంటోంది బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే. పూనమ్‌-సామ్‌ బాంబే దంపతులు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన నటి ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.

ఈ తప్పుడు కథనాల ద్వారా తనను అనవసరంగా గర్భవతిని చేసేయకండి అని వ్యాఖ్యానించింది. ప్రెగ్నెంట్‌ అని తెలియగానే ప్రతి మహిళ సంబరపడుతుంది కానీ తన విషయంలో అలా జరగడం లేదని ఎందుకంటే ఇప్పుడు తాను గర్భవతిని కాదని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటివి రాసేముందు కనీసం ఒక మాటైనా తనను అడగమని కోరింది. తన జీవితం తెరిచిన పుస్తకం అన్న పూనమ్‌ నిజంగా గర్భం దాల్చిన రోజు మిఠాయిలు పంచుతానని పేర్కొంది.

కాగా పూనమ్‌.. దర్శకుడు సామ్‌ బాంబేను గతేడాది సెప్టెంబర్‌ 1న పెళ్లాడింది. కానీ పెళ్లైన నెల రోజులకే భర్త చిత్రహింసలు పెడుతున్నాడంటూ అతడిపై గృహహింస కేసు పెట్టింది. మళ్లీ అంతలోనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ వైవాహిక బంధంలో ఇలాంటి ఆటుపోట్లు సాధారణమని చెప్తూ తామిద్దరం కలిసిపోయామని చెప్పింది.

చదవండి: ఎక్కువ కాలం హీరోయిన్‌గా ఉండాలంటే సమంతలా రాణించాల్సిందే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు