హైదరాబాద్‌లో ప్రారంభమైన 'పూర్ణ' మూవీ షూటింగ్‌

8 Aug, 2022 15:02 IST|Sakshi

వరుణ్‌ హీరోగా, సోనాక్షీ వర్మ, చైతన్య ప్రియ హీరోయిన్లుగా ‘పూర్ణ’ అనే చిత్రం షురూ అయింది. యమ్‌ఆర్డీ ప్రొడక్షన్‌ పతాకంపై యమ్‌ఆర్‌ దీపక్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్న కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నిర్మాత సి.కల్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు.

దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గౌరవ దర్శకత్వం వహించగా, తెలంగాణ ఫిలింఛాంబర్‌ సెక్రటరీ అనుపమ్‌ రెడ్డి చిత్ర యూనిట్‌కి స్క్రిప్టు అందించారు. దర్శక–నిర్మాత యమ్‌ఆర్‌ దీపక్‌ మాట్లాడుతూ–‘‘పూర్ణ అనే అమ్మాయి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ‘పూర్ణ’ కథ రెడీ చేశా. సస్పెన్స్‌, థ్రిల్లర్‌తో పాటు చక్కని లవ్‌ స్టోరీ ఉంటుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో షటింగ్‌ పూర్తి చేస్తాం’’ అన్నారు.

‘‘భయమంటే తెలియని ఓ అబ్బాయి అనుక్షణం భయపడే ఒక అవ్మయికి ఎలాంటి ధైర్యం ఇచ్చాడు?’’ అన్నది ఆసక్తిగా ఉంటుంది అన్నాడు వరుణ్‌. నటులు విజయ్‌ భాస్కర్, ఆజాద్, కెమెరామెన్‌ కొల్లి ప్రసాద్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌ కిరణ్‌. 

మరిన్ని వార్తలు