Kanak Rele Paased Away: క్లాసికల్‌ డాన్సర్‌, పద్మభూషణ్‌ అవార్డు గ్రహిత కనక్‌ రెలే హఠాన్మరణం

23 Feb, 2023 13:00 IST|Sakshi

లెజెండరి క్లాసికల్‌ డాన్సర్‌, పద్మభూషన్‌ అవార్డు గ్రహిత కనక్‌ రెలే(85) హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో ఆమె మృతికి నటి హేమ మాలిని,సుధచంద్రన్‌లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకురాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. కనక్‌ రెలే మోహీని అట్టం డాన్స్‌లో ప్రావీణ్యురాలు.

చదవండి: కేరళ హైకోర్టులో మోహన్‌ లాల్‌కు చుక్కెదురు!

అంతేకాదు ఆమె నలంద నృత్య కళా మహావిద్యాలయ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ కూడా. శాస్త్రీయ నృత్యానికి ఆమె అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. జూన్‌ 11, 1937లో గుజరాత్‌లో జన్మించిన  కనక్‌ రెలే భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో ఒకరిగా పేరు పొందారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఆమె మేనమామ కళలను నెరవేర్చాలని భావించి నాట్యాన్ని నేర్చుకున్నారు.

చదవండి: గుడ్‌ మార్నింగ్‌ అమెరికా షోలో చరణ్‌, చిరంజీవి ఏమన్నారంటే!

మరిన్ని వార్తలు