Lady Oriented Movies 2022 : హీరోలు లేకపోయినా.. సినిమాను నడిపించిన హీరోయిన్స్‌

17 Dec, 2022 09:43 IST|Sakshi

సినిమాలో గ్లామర్‌ కావాలి.. అందుకేగా హీరోయిన్‌... స్పెషల్‌ సాంగ్‌ అదిరిపోవాలి... ఉన్నారుగా హీరోయిన్లు.. స్పెషల్‌ సాంగ్‌ చేసే తారలు.. ‘ఫీమేల్‌ స్టార్స్‌’ అంటే.. ఇంతకు మించి పెద్దగా ఆలోచించరు. హీరోయిన్లు కూడా గ్లామరస్‌ క్యారెక్టర్స్‌కి సై అంటారు. అయితే గ్లామర్‌కి అతీతంగా పర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ వస్తే వెంటనే ఒప్పేసుకుంటారు. సవాల్‌గా తీసుకుని ఆ పాత్రలను చేస్తారు. రిస్కీ ఫైట్స్‌ చేయడానికి కూడా వెనకాడరు. 2022 ఇలాంటి పాత్రలను చాలానే చూపించింది. హీరోయినే హీరోగా వచ్చిన లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల గురిం తెలుసుకుందాం.

‘మహానటి’ (2018) చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయిం, లేడీ ఓరియంటెడ్‌ ఫిలింస్‌కి ఓ మంచి చాయిస్‌ అయ్యారు కీర్తీ సురేశ్‌. ఆ తర్వాత ఆమె ‘పెంగ్విన్‌ మిస్‌ ఇండియా వంటి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేశారు. ఇక ఈ ఏడాది ‘గుడ్‌లక్‌ సఖి’, ‘సాని కాయిదమ్‌’ (తెలుగులో ‘చిన్ని’) వంటి కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. నగేశ్‌ కుకునూరు దర్శకత్వంలో వచ్చిన ‘గుడ్‌లక్‌ సఖి’ జనవరి 28న థియేటర్స్‌లో విడుదలకాగా, దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కింన ‘సాని కాయిదమ్‌’ మే 6 నుంచి డైరెక్ట్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఓ గ్రామీణ యువతి జాతీయ స్థాయి రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో ఎలా బంగారు పతకం సాధింంది? అన్నది ‘గుడ్‌లక్‌ సఖి’ కథ. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకునే ఓ కానిస్టేబుల్‌ ఆవేదన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘చిన్ని’. ఇక ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేసిన ప్రియమణి ఈ ఏడాది ‘భామాకలాపం’ చేశారు. అభిమన్యు దర్శకత్వంలో రపొందిన ఈ సినివ ఫిబ్రవరి 11 నుం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాలో పక్కింటి విషయాలపై ఆసక్తి చూపిస్తూ, ఓ కుకింగ్‌ యూట్యూబ్‌ చానెల్‌ను రన్‌ చేసే అనుపమ ఇరుకుల్లో పడుతుంది. ఓ వ్యక్తి  హత్యకి సంబంధింన మిస్టరీ నుంచి తనను కాపాడుకునే అనుపమ పాత్రను ప్రియమణి చేశారు.

మరోవైపు ఐదారేళ్లుగా బాలీవుడ్‌లో లేడీ ఓరియంటెడ్‌ సినివలు చేస్తున్న తాప్సీ 2019లో వచ్చిన ‘గేమ్‌ ఓవర్‌’ తర్వాత తెలుగులో ఈ ఏడాది ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లో నటించారు. చైల్డ్‌ ట్రాఫికింగ్‌ (న్నారుల అక్రమ రవాణా) నేపథ్యంలో రపొందిన ఈ చిత్రానికి ఆర్‌ఎస్‌ స్వరప్‌ దర్శకుడు. చిన్నారులను చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠా బారి నుం రక్షించే శైలజ పాత్రను తనదైన శైలిలో చేసి, మెప్పించారు తాప్సీ. ఏప్రిల్‌ 1న ఈ త్రం విడుదలైంది. ఇంకోవైపు నివేదా పేతురాజ్‌ ప్రధాన పాత్రలో నటింన ‘బ్లడీ మేరీ’ త్రం ఏప్రిల్‌ 15 నుం ఆహా ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

హ్యమన్‌ ట్రాఫికింగ్‌ ముఠా నేరాలకు మర్డర్, రివెంజ్‌ అంశాల టచ్‌ ఇచ్చి ఈ సినివను తెరకెక్కించారు చందు మొండేటి. అనాథ నర్సు మేరీ పాత్రలో నటించారు నివేదా పేతురాజ్‌. ఇక ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ (1996) తర్వాత ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ఓ లీడ్‌ రోల్‌ చేసిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో రపొందిన ఈ సినివలో టైటిల్‌ రోల్‌ చేశారు సుమ. అడిగినవారికి సాయం చేస్తూ, శుభ కార్యాలప్పుడు గ్రామస్తులకు ఈడ్లు (చదివింపులు) ఇచ్చే మంచి మనసు ఉన్న మనిషి జయమ్మ. హఠాత్తుగా జయమ్మ భర్తకు గుండెపోటు వస్తుంది. కానీ ఆ సమయంలో గ్రామస్తులు జయమ్మకు సహాయం చేయకపోగా, కొందరు విమర్శిస్తారు. ఆ తర్వాత జయమ్మ ఏం చేసింది? కుటుంబాన్ని ఎలా చక్క దిద్దుకుంది? అన్నదే కథాంశం. మే 6న ఈ సినిమా రిలీజైంది.

ఇంకోవైపు పదేళ్ల తర్వాత అంటే 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ చిత్రం తర్వాత హీరోయిన్‌ లావణ్యా త్రిపాఠి చేసిన మరో ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌గా ‘హ్యాపీ బర్త్‌డే’అని చెప్పుకోవచ్చు. రితేష్‌ రానా తెరకెక్కింన ఈ చిత్రం జూలై 8న రిలీజైంది. దేశంలో గన్‌ కల్చర్‌ను ప్రోత్సహించే విధంగా ఓ కేంద్రమంత్రి గన్‌ బిల్లు ప్రతిపాదనను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఫ్యాంటసీ జానర్‌లో సాగే ఈ చిత్రంలో గన్‌ కల్చర్‌కు, హ్యాపీ అనే అమ్మాయి బర్త్‌డేకి ఉన్న సంబంధం ఏంటి? అనేది ప్రధానాంశం. ఇక ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో సౌత్‌ కొరియన్‌ ఫిల్మ్‌ ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ ఆధారంగా రీమేక్‌ అయిన చిత్రం ‘శాకినీ డాకినీ’. రెజీనా, నివేదా థామస్‌ టైటిల్‌ రోల్స్‌లో ఈ చిత్రాన్ని దర్శకుడు సుదీర్‌ వర్మ తెరకెక్కించారు.

అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి, అక్రమాలకు పాల్పడే ఓ ముఠా ఆట కట్టించే ఇద్దరు ఉమెన్‌ ట్రైనీ పోలీసాఫీసర్ల సాహసాల ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. మరోవైపు సమంత తన కెరీర్‌లో దాదాపు యాభై సినివలు చేస్తే, వాటిలో ‘యూ టర్న్‌’, ‘ఓ బేబీ’... లాంటి లేడీ ఓరియంటెడ్‌ ఫిలింస్‌ కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఈ ఏడాది ‘యశోద’ చిత్రం చేరింది. సమంత టైటిల్‌ రోల్‌లో హరి–హరీష్‌ దర్శకత్వంలో రపొందిన ఈ చిత్రం నవంబరు 11న రిలీజైంది. సరోగసీ సాకుతో మహిళలపై అఫయిత్యాలకు పాల్పడే ఓ ముఠా గుట్టును పోలీస్‌ ఆఫీసర్‌ యశోద ఎలా బయటపెట్టింది? అనే నేపథ్యంలో ‘యశోద’ సినిమా సాగుతుంది. అలాగే సమంత టైటిల్‌ రోల్‌ చేసిన మరో చిత్రం ‘శాకుంతలం’ ఈ ఏడాదే విడుదల కావాల్సింది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ మైథలాజికల్‌ ఫిల్మ్‌కు గుణశేఖర్‌ దర్శకుడు.

ఇక ఐదారేళ్లుగా ప్రతి ఏడాదీ నయనతార నటింన ఒక ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ అయినా వీక్షకుల ముందుకు వస్తోంది. ఈ ఏడాది ఆమె నటింన ‘ఓ2’ త్రం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ప్లాట్‌ఫామ్‌లో జూన్‌ 17 నుం స్ట్రీమింగ్‌ అవుతోంది. జీఎస్‌ విఘ్నేష్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ కథలో పార్వతిని ట్రాప్‌ చేస్తారు. సడన్‌గా అక్కడ ఆక్సిజన్‌ లెవల్స్‌ తగ్గిపోతాయి. ఆ పరిస్థితుల నుంచి పార్వతి ఎలా బయటపడింది? తన కొడుకును ఎలా కాపాడుకోగలిగింది? అన్నదే కథ. అలాగే నయనతార నటించిన లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘కనెక్ట్‌’ ఈ నెల 22న రిలీజ్‌ కానుంది.

ఇక అనుపమా పరమేశ్వరన్‌ నటింన తాజా చిత్రం ‘బటర్‌ ఫ్లై’. గంటా సతీష్‌ బాబు ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం ఈ 29 నుం డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. వీరితో పాటు మరికొందరు హీరోయిన్లు ‘కథనాయిక ప్రాధాన్యం’గా సాగే చిత్రాల్లోనూ, వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు. ఈ ప్రాజెక్ట్స్‌లో కొన్ని సక్సెస్‌ కాగా, కొన్ని ఫెయిల్‌ అయ్యాయి. అయితే నటనపరంగా మాత్రం హీరోయిన్లు హిట్టే.

మరిన్ని వార్తలు