చంద్రబాబుకు జైకొట్టిన వాళ్లకే ‘నంది’ ఇచ్చారు: పొసాని

9 Apr, 2023 14:06 IST|Sakshi

నంది అవార్డులపై నటుడు, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పొసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఆయన అనుకూల నటనావర్గానికే నంది అవార్డులు ఇచ్చారని ఆరోపించారు.  ప్రతిభను ప్రామాణికంగా తీసుకోకుండా చంద్రబాబు భజనే కొలమానంగా తీసుకొని అవార్డుల పంపకాలు జరిగాయని విమర్శించారు.

తాజాగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ  నంది అవార్డులను గత ప్రభుత్వం అపహాస్యం చేసిందన్నారు. ‘నంది అవార్డులు ప్రతిభ ఉన్నవారికి దక్కడం లేదు. చంద్రబాబుకు అనకూలంగా ఉన్నవారికే అవార్డులు ఇచ్చేవారు.  ఆయనకు జైకొడితేనే  అవార్డుల జాబితాలో పేరు ఉండేది. లేదంటే ఎంత టాలెంట్‌ ఉన్నా పక్కన పెట్టేవారు. మోహన్‌గాంధీ రికమెండ్‌ చేసినా నాకు నంది అవార్డు దక్కలేదు.

ఇక టెంపర్‌ సినిమాకు నాకు తప్పనిసరి పరిస్థితుల్లో నంది అవార్డు ఇచ్చారు. కమిటీలో ఉన్న 12 మందిలో 10మంది కమ్మవాళ్లు ఉన్నారు. అందుకే ఆ అవార్డుని తిరస్కరించాను. ఈ విషయాన్ని 2017లోనే ప్రెస్‌ మీట్‌ పెట్టి చెప్పాను. ప్రతి విషయంలోనూ రాజకీయం చేసే చంద్రబాబు... చివరకు నంది పురస్కారాల్లో తన అనుకూల వర్గానికే ఇచ్చాడు. వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఒక్కవర్గానికే కొమ్ముకాశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలా కాదు. సొంతంగా పార్టి పెట్టుకొని అధికారంలోకి వచ్చారు.  అన్ని వర్గాల వారికి ఆయన న్యాయం చేస్తున్నాడు. నిజయితీగా పని చేస్తున్నారు’అని పొసాని అన్నారు.

>
మరిన్ని వార్తలు