Posani Krishna Murali: అలా చేశారని నిరూపిస్తే.. నీ కాళ్లు మొక్కుతా: పోసాని కృష్ణమురళి

1 May, 2023 21:26 IST|Sakshi

ఏపీలో నంది అవార్డులపై చేసిన కామెంట్స్‌పై నటుడు, నిర్మాత, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. అశ్వనీదత్‌ చేసిన కామెంట్స్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు.. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు అనే అవార్డులు ఇవ్వాలని చురకలంటించారు. ఉత్తమ వెధవలు.. ఉత్తమ సన్నాసులు అని మీ వాళ్లకే అవార్డులు ఇవ్వాలని అన్నారు. 

మీరంతా ఎందుకు వైఎస్‌ జగన్  మీద పడి ఏడుస్తున్నారని నిలదీశారు. మీకు ఏమి అన్యాయం చేశారని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబులాగా వెన్నుపోటు పొడిచాడా.. ఎవరికైనా అన్యాయం చేశారో నిరూపించు.. నీ కాళ్లకు మొక్కుతా అని అన్నారు. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టినప్పుడు నువ్వేం చేశావు అని ప్రశ్నించారు. నీ  బతుకు నాకు తెలుసు.. నా బతుకు నీకు తెలుసు.. ఇప్పటికైనా కొంచెం నీతితో జీవించు అని హితవు పలికారు. 

పోసాని మాట్లాడుతూ.. 'వైఎస్‌ జగన్ అధికారంలోకి  వచ్చి నాలుగేళ్లు అవుతోంది. రెండేళ్లు కరోనా వచ్చింది. దాని నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నారు. తరువాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఇస్తున్నారు. ఆయన వచ్చిన తరువాత నంది అవార్డులు ఇవ్వలేదు. అవార్డులు ఇస్తే ఎవరూ పేరు పెట్టని విధంగా ఇస్తారు. రజనీకాంత్ రోజూ చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబు ను పొగిడినా మాకు అభ్యంతరం లేదు.

మాకు సూపర్ స్టార్ చిరంజీవి. చిరంజీవికి జగన్ అంటే ఎంత ప్రేమో.. అలాగే చిరంజీవికి ఎనలేని గౌరవం ఇస్తారు సీఎం జగన్’ అని పోసాని పేర్కొన్నారు. కాగా.. నంది అవార్డులపై అశ్వనీదత్ మాట్లాడుతూ.. ఉత్త‌మ గూండా, ఉత్తమ రౌడీ.. అనే అవార్డుల‌ను ఇస్తారేమో అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు