భారీ బడ్జెట్‌తో విజయ్‌ సేతుపతి ‘విడుదల’, రూ. 10 కోట్లతో రైలు సెట్‌

4 Sep, 2022 00:47 IST|Sakshi
విజయ్‌ సేతుపతి,సూరి

విజయ్‌ సేతుపతి ఉపాధ్యాయుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘విడుదలై’ (విడుదల). కానిస్టేబుల్‌ పాత్రను సూరి చేస్తున్నారు. వెట్రిమారన్‌ దర్శకత్వంలో ఎల్రెడ్‌ కుమార్, ఉదయనిధి స్టాలిన్‌ రెండు భాగాలుగా నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మొదటి భాగం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండో భాగంలో కొన్ని సన్నివేశాలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

కళా దర్శకుడు జాకీ నేతృత్వంలో రూ. 10 కోట్లతో రైలు, రైలు బ్రిడ్జి సెట్‌ రూపొందించాం. అలాగే సిరుమలై ప్రాంతంలో పల్లెటూరి నేపథ్యంలో భారీ సెట్‌ నిర్మించాం. ప్రస్తుతం యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్‌ నేతృత్వంలో కొడైకెనాల్‌లో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాం. ఇందులో బల్గేరియా నుండి తమిళనాడుకి వచ్చిన స్టంట్‌ బృందం పాల్గొంటోంది’’ అన్నారు. భవాని శ్రీ, ప్రకాశ్‌రాజ్, గౌతమ్‌ మీనన్, రాజీవ్‌ మీనన్, చేతన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, కెమెరా: వేల్‌రాజ్‌. 

మరిన్ని వార్తలు