ఆ తర్వాతే నా ఆలోచనలు తప్పని నాకు అర్థమైంది

9 Jun, 2021 02:13 IST|Sakshi

‘‘ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరకంగా దృఢంగా ఉండటమే కాదు... మానసికంగా కూడా బలంగా ఉండటం. కొన్ని సందర్భాల్లో మన భావోద్వేగాలను మనమే కంట్రోల్‌ చేసుకోగల మనోధైర్యాన్ని కలిగి ఉండాలి’’ అని అంటున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఇంకా రకుల్‌ ప్రీత్‌ మాట్లాడుతూ – ‘‘యోగా చేయడం చాలా బోర్‌గా ఉంటుందేమో అనుకునేదాన్ని. కానీ ఒకసారి మొదలు పెట్టిన తర్వాత నా ఆలోచనలు తప్పని నాకు అర్థమైంది. యోగా వల్ల సత్ఫలితాలు ఉంటాయని తెలిసింది.

యోగా వల్ల నాలో సానుకూల ఆలోచనా ధోరణి పెరిగింది కూడా. ఇక.. మన శరీరం రీచార్జ్‌ కావాలంటే హాయిగా నిద్రపోవాలి. అప్పుడే మనలో ఎనర్జీ లెవల్స్‌ పెరుగుతాయి. నిద్రించే ముందు డిజిటల్‌ డివైజ్‌లకు దూరంగా ఉండండి. మొబైల్‌ ఫోన్స్‌ వాడకాన్ని తగ్గించండి. ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోండి. సరిపడా నిద్రతో పాటు వర్కౌట్స్‌తో నేను రీచార్జ్‌ అవుతున్నాను. మీరు కూడా సరైన నిద్ర, వ్యాయామాలతో  రీచార్జ్‌ అవుతూ ఉండండి’’ అన్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు