వినోదాల పొట్టేల్‌ 

29 Dec, 2023 00:38 IST|Sakshi

యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొట్టేల్‌’. ‘బందం రేగడ్‌’, ‘సవారీ’ చిత్రాల ఫేమ్‌ సాహిత్‌ మోతుకూరి దర్శకత్వంలో నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేష్‌ కుమార్‌ సడిగే నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ఫస్ట్‌ ఇంపాక్ట్‌ లాంచ్‌ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘పొట్టేల్‌’ సినిమా ఫస్ట్‌ లుక్‌ వీడియో చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించింది. ఈ సినిమా షూటింగ్‌ను చూసేందుకు సెట్స్‌కు వెళ్లాను. ప్రేక్షకులకు ఓ మంచి కథని చూపించడానికి టీమ్‌ చాలా కష్టపడి పని చేసింది.

ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చి, పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘వినోదంతో పాటు మంచి ప్రయోజనం కోసం చేసిన చిత్రమిది’’ అన్నారు యువ చంద్రకృష్ణ. ‘‘పొట్టేల్‌’ కథ రాసినప్పుడు ఎంత హై ఫీలయ్యానో అదే హై ఈ రోజు వరకూ వుంది. నిశాంక్, సురేష్‌ చాలా ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు. యువ చంద్ర, అనన్య బెస్ట్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో అజయ్‌గారు కీ రోల్‌ చేశారు’’ అన్నారు సాహిత్‌ మోతుకూరి. ‘‘సినిమా అద్భుతంగా వచ్చింది. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు నిశాంక్, సురేష్‌. ‘‘అందరూ గుర్తుంచుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు అనన్య. 

>
మరిన్ని వార్తలు